- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
8 మంది.. 80 ఏళ్లు.. ఆకాశం నుంచి అలా పడ్డారు
దిశ, ఫీచర్స్ : 80 ఏళ్ల వయసున్న వ్యక్తుల జీవితం రొటీన్‌గా, ఎలాంటి విషయాలపై ఆసక్తి లేకుండా స్తబ్దుగా సాగుతుంది. అందరి విషయంలోనూ ఇలాగే జరగకున్నా 80వ పడికి చేరుకున్న మెజారిటీ వృద్ధులు ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే స్నేహితులు, బంధువులను చూస్తారు. అంతేతప్ప 20 ఏళ్ల యువత కూడా చేసేందుకు సంకోచించే పనుల జోలికైతే వెళ్లరు. కానీ ఎనభైయేళ్లు దాటిన ఈ అష్టదిగ్గజాల సమూహం విమానం నుంచి దూకి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది.
ది జంపర్స్ ఓవర్ ఎయిటీ సొసైటీ(JOES) సభ్యులు.. స్కైడైవ్ చేసి 80 ఏళ్ల వయసు పైబడిన వారిలో అతిపెద్ద జంపర్స్ ఫార్మేషన్‌గా రికార్డ్ సృష్టించారు. ఎనిమిది మంది సభ్యులైన 'జిమ్ కుల్హానే, క్లిఫ్ డేవిస్, స్కాటీ గాలన్, వాల్ట్ గ్రీన్, పాల్ హినెన్, స్కై హుమినిస్కీ, ఉడీ మెకే, టెడ్ విలియమ్స్' స్కైడైవ్ ద్వారా రికార్డ్ నెలకొల్పేందుకు తమను తాము వృత్తాకార ఆకృతి(సర్కిల్ ఫార్మేషన్)లో ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రపంచ రికార్డ్ విషయానికొస్తే.. 80 ఏళ్లు పైబడిన ఆరుగురు జంపర్లు తమ ఫార్మేషన్‌తో రికార్డ్ సృష్టించారు. కాగా ఇంటర్నేషనల్ స్కైడైవింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రేషన్ కోసం మూడు రోజుల ఈవెంట్‌లో భాగంగా స్కైడైవ్ డిలాండ్‌లో ఈ స్కైడైవ్ నిర్వహించబడింది.
'మనలో చాలా మంది కొన్నేళ్లుగా ఆధునిక క్రీడ స్కైడైవింగ్‌కు గణనీయమైన సహకారాన్ని అందించారు. ఇక మా టీమ్ నైపుణ్యాలు కాలానుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని వివరించే ప్రదర్శనతో మా క్రీడకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మేమంతా గర్విస్తున్నాం' అని జంపర్లు స్థానిక మీడియాకు తెలిపారు.