- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
World Lion Day
సింహాల గురించి అవగాహన పెంచేందుకు, వాటి రక్షణ & పరిరక్షణకు మద్దతు సమీకరించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 10న 'ప్రపంచ సింహాల దినోత్సవం' జరుపుకుంటారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ యానిమల్స్(WWF) ప్రకారం, సింహాన్ని తరచుగా 'అడవికి రాజు'గా పిలిచినప్పటికీ.. నిజానికి ఇది పచ్చిక బయళ్లు, మైదానాల్లో మాత్రమే నివసిస్తుంది. కాగా 'బ్రెయిన్‌చైల్డ్' కోఫౌండర్స్ డెరెక్ - బెవర్లీ జౌబెర్ట్ దంపతులు.. సింహాల మీద ఉన్న ప్రేమతో 2013లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అడవిలో నివసించే సింహాలను రక్షించేందుకు నేషనల్ జియోగ్రాఫిక్, ది బ్యాగ్ క్యాట్ ఇనిషియేటివ్ లాంటి గొప్ప సంస్థలతో కలిసి పనిచేశారు. ఇక భారతదేశంలో సింహాల జనాభా 2015లో 523 నుంచి 2020లో 674కి చేరుకుని అత్యధికంగా 29 శాతం పెరుగుదలను నమోదు చేసింది. వాటి పరిధి 2015లో 22,000 చ.కి.మీ నుంచి 30,000 చ.కి.మీ విస్తరించిందని నివేదిక పేర్కొంది.