- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Workplace : వర్క్‌ప్లేస్ సిస్టర్ హుడ్..! వృత్తి నైపుణ్యాన్ని పెంచుతున్నఅనుబంధం
దిశ, ఫీచర్స్ : ‘వర్క్ ప్లేస్ సిస్టర్ హుడ్’ కార్పొరేట్ రంగుల ప్రపంచంలో ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదమిది. కొత్తగా చేరిన మహిళా ఉద్యోగులు వృత్తిలో రాణించడానికి, నైపుణ్యం పెంచుకోవడానికి, పని ప్రదేశంలో అసమానతలు పోగొట్టడానికి ఉపయోపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు అక్కా చెల్లెళ్ల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఒకరి వస్తువులు మరొకరు షేర్ చేసుకుంటారు. కష్ట సుఖాలు పంచుకుంటారు. అన్ని విషయాల్లోనూ ఒకరి ఎదుగుదలకు మరొకరు సహాయపడతారు. అయితే ఇలాంటి అనుబంధమే వర్క్‌ప్లేస్‌లోనూ మహిళల మధ్య ఉండటాన్ని వర్క్ ప్లేస్ సిస్టర్ హుడ్‌గా పేర్కొంటున్నారు నిపుణులు. దీనివల్ల మహిళలు తమ కెరీర్‌లో ఎదగడం, వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ సాధించడం సాధ్యం అవుతుంది.
* ఒక వృత్తిలో రాణించాలంటే స్కిల్స్‌తో పాటు వర్క్ ప్లేస్ వాతావరణం కూడా కీ రోల్ పోషిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండే ఇతర ఉద్యోగుల సహకారం కూడా అవసరం అవుతుంది. అయితే అనేక సంస్థల్లో మహిళలు తక్కువగా ఉంటున్న పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ తోటి ఉద్యోగుల నుంచి తగిన ప్రోత్సాహం, సహకారం లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణంగా నిపుణులు చెప్తుంటారు. అందుకే వర్క్ ప్లేస్‌లో మహిళా ఉద్యోగులు తోటి మహిళా ఉద్యోగులతో ఫ్రెండ్లీగా మెలగడం, అవసరమైన విషయాలను నేర్పించడం, నేర్చుకోవడం వంటివి కొనసాగించాలి. ఈ చొరవనే సిస్టర్ హుడ్‌గా పరిగణిస్తారు.
*తోటి ఉమన్ ఎంప్లాయీస్‌కు ప్రమోషన్ వచ్చినా, ఇంక్రిమెంట్ వచ్చినా అసూయపడే వారు కూడా ఉంటారు కొందరు. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించడమే సిస్టర్ హుడ్ ట్రెండ్ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మహిళా ఉద్యోగులు ఎవరు ఏ స్థానంలో ఉన్నా సరే, ఒకరిపట్ల ఒకరు అసూయ భావాలు కలిగి ఉండరు. పైగా పనితీరును ప్రశంసించడం, మెరుగు పర్చడం, ప్రమోషన్లు వచ్చినప్పుడు ప్రోత్సహించడం వంటివి చేస్తుంటారు. ఒకరి సక్సెస్‌ను మరొకరు సెలబ్రేట్ చేసుకుంటారు. తోటి మహిళా ఉద్యోగులను అక్కా చెల్లెళ్ల మాదరి ప్రోత్సహించడం, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడం, వృత్తిలో రాణించేలా తీర్చిదిద్దడం వంటివి ‘సిస్టర్ హుడ్’లో భాగం. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కే కాకుండా మహిళా ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు.