హెల్తీ లైఫ్ స్టైల్‌.. ఏం చేస్తే సాధ్యమో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-04-08 08:55:40.0  )
హెల్తీ లైఫ్ స్టైల్‌.. ఏం చేస్తే సాధ్యమో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: లైఫ్ స్టైల్‌ను బట్టి కూడా మన అనారోగ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం పోషకాహారంతోపాటు వ్యాయామం కూడా అవసరమని అంటున్నారు. అందుకే వర్కవుట్స్‌కు కొంత సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. హార్ట్, లంగ్స్‌ను బలోపేతం చేయంలో కార్డియో వాస్కులర్ వర్కవుట్ వంటిది తోడ్పుడుతుంది. ఇది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కండరాలను బలోపేతం చేస్తుంది. శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు రిలీజ్ అయ్యేందుకు దోహదం చేస్తుంది. దీంతోపాటు వాకింగ్, ఆరోగ్యానికి మేలు చేసే ఇతర వ్యాయామాలు ఎంచుకోవాలి.

ఆహారపు అలవాట్లు

తీసుకునే ఆహారం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి పౌష్టికాహారం తప్పక తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. తృణధాన్యాలు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు , మినరల్స్ వంటి ఆహారపు అలవాట్ల ద్వారా సమతుల్య పోషకాలు లభిస్తాయి. అలాగే అతిగా తినడం కూడా మంచిది కాదు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం బెటర్ .

వ్యాయామం

చాలా మంది వ్యాయామం చేయాలని ఉన్నా సమయం దొరకట్లేదు అంటుంటారు. కానీ బంధువులో, ఆఫీసు నుంచి వచ్చిన ఫోన్లలోనో గంటల తరబడి మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడాన్ని కాదనలేం. అది అవసరం కావచ్చు. కానీ అలా మాట్లాడే సమయాన్ని కూడా ఆరోగ్యం కోసం యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ మాట్లాడేటప్పుడు అటూ ఇటూ నడుస్తూ మాట్లాడితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. కొంతైనా శారీరక శ్రమ చేసినవారవుతారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

సరైన నిద్ర, పరిసరాలు

బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా చాలామంది రాత్రుల్లో నిద్రకు దూరం అవుతుండటం మనం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పనిపై కాన్సన్‌ట్రేషన్ లేకుండా పోతుంది. శరీరంలో జీవక్రియలు జరిగ్గా ఉండవు. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. హృదయా నాళాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. అందుకే కనీసం 6 నుంచి 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన నిద్ర శరీర కణాలను, అవయవాలను ఉత్తేజ పరుస్తుంది. వ్యక్తి ఉల్లాసంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అలాగే మీరుండే పరిసరాలు మీకు ఆహ్లాదకరంగా ఉండేలా చేసుకోవాలి. దీనివల్ల మీరు సంతోషంగాను, ఆరోగ్యంగాను ఉండగలుగుతారు. వీటితోపాటు ప్రతీ ఆరునెలలకో, ఏడాదికో మొత్తం హెల్త్ చెకప్‌లు చేయించుకోవడంవల్ల సమస్యలేమైనా ఉంటే జాగ్రత్త పడవచ్చు. మందుల ద్వారా తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: నవ వధూవరులతో సత్య నారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా?

Advertisement

Next Story