శానిటరీ ప్యాడ్స్ విషయంలో మహిళలు బీకేర్ ఫుల్.. ఎన్ని గంటలకొకసారి మార్చుకోవాలంటే!

by Jakkula Samataha |
శానిటరీ ప్యాడ్స్ విషయంలో మహిళలు బీకేర్ ఫుల్.. ఎన్ని గంటలకొకసారి మార్చుకోవాలంటే!
X

దిశ, ఫీచర్స్ : ప్రతి స్త్రీ ఎదుర్కొనే సమస్యల్లో బుతుస్రావం ఒకటి. ఆరోగ్యకరమైన స్త్రీ శరీరం సహజ ప్రక్రియ ఇది. ప్రతీ నెల మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఇక మహిళలు బుతుక్రమం సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బహిష్ట కోసం శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తుంటారు. స్త్రీలకు సౌకర్యవంతంగా ఉండటానికి శానిటరీ ప్యాడ్స్ వాడుతారు. న్యాప్‌కిన్‌లు,మెన్ స్ట్రువల్ కప్పులు, టాంపాస్‌లు ఉన్నప్పటికీ మహిళలు ఎక్కువగా శానిటరీ ప్యాడ్స్ మాత్రమే వాడుతుంటారు. ఎందుకంటే ఇవి ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది.

అయితే చాలా మందికి ఈ శానటరీ ఫ్యాడ్స్ వాడటంలో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఒక శానిటరీ ప్యాడ్ ఎన్ని గంటల వరకు వాడొచ్చు. ఒక వేళ ఎక్కువ సేపు యూస్ చేయడం వలన ఏమైనా సమస్యలు తలెత్తుతాయా అని ఆలోచిస్తుంటారు. అయితే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి శానిటరీ ప్యాడ్స్ మార్చాలంట. శానిటరీ ప్యాడ్ సరిగా మార్చకపోతే, ప్రైవేర్ట్ పార్ట్‌లో దురద, ఇన్ఫెక్షన్, ఫంగల్, ఈస్ట్, బ్యాక్టీరియా, కిడ్నీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యోని ఇన్ఫెక్షన్లే కాదు శానిటరీ ప్యాడ్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లు అంటే బ్లాడర్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed