- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TDP: విజయమ్మ హత్యకు కుట్ర ?.. టీడీపీ సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ విజయమ్మ(YS Vijayamma)ను చంపేందుకు జగన్ కుట్ర పన్నాడా ? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టీడీపీ (TDP)ఎక్స్ లో చేసిన పోస్ట్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయమ్మ ప్రయాణిస్తున్న కారు రెండు చక్రాలు ఊడిపోయాయి. ఈ ఘటన 2024 ఎన్నికలకు (2024 Elections) ముందు జరగ్గా.. టీడీపీ తాజాగా అనుమానాలు లేవనెత్తింది. కారు టైర్లు ఊడిపోయిన వీడియోను పోస్ట్ చేసి.. అత్యాధునిక సెక్యూరిటీ, హంగులున్న టయోటా వెల్ ఫెయిర్ కొత్తకారుకు టైర్లు ఊడిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. 2019 ఎన్నికల సమయంలో బాబాయ్ ని లేపేసినట్లే 2024 ఎన్నికల్లో మరో పెద్దతలకాయను లేపేసేందుకు జగన్ ప్లాన్ చేశాడేమోనని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది.
"రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు... వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి. ఇంకా నయం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంత హై ఎండ్ కారు, అదీ కొత్త కారుకి ఇలా జరగడం చూసి, ముందు ఆశ్చర్యపోయి, తర్వాత మన సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి, ఏం జరిగిందో చాలా మంది ఊహించారు.
ఇదంతా జరిగింది 2024 ఎన్నికల ముందు. 2019 ఎన్నికలకు బాబాయ్ ని లేపేసినట్టే... ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగింది. తర్వాత ఏడాది పాటు విజయ రాజశేఖర్ రెడ్డి గారు అమెరికాలోనే ఉన్నారు. లోగుట్టు ఆ కుటుంబానికే ఎరుక!" అని టీడీపీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సంచలనానికి దారితీసింది.
రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు... వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు… pic.twitter.com/GWGdbXm6xz
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2024