- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు డ్రైవింగ్ రాదా..? ట్రాఫిక్ నేరాలు, ప్రమాదాలకు గురవుతుంది మగవారే: అధ్యయనం
దిశ, ఫీచర్స్: స్త్రీ ప్రతి రంగంలోనూ పురుషుడితో సమానంగా రాణిస్తోంది. అటు కుటుంబాన్ని ఇటు ఉద్యోగాన్ని ఏకకాలంలో నిర్వహిస్తూ వారి కంటే మెరుగ్గా ఉంటోంది. అయితే మగవారితో పోలిస్తే 'మహిళలు డ్రైవింగ్ చేయలేరు' లేదా 'డ్రైవింగ్ అనేది రాని పని' అనే మాటలు సొసైటీలో తరుచూ వింటుంటాం. కానీ ఈ నమ్మకానికి ఆధారం ఏంటి? స్త్రీలు డ్రైవింగ్ చేయలేరని చెప్పేందుకు సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏదైనా ఉందా? లేక స్త్రీలను తక్కువ చేసి చూపడం కోసం పితృస్వామ్య సమాజం ఎంచుకున్న మరో మూస పద్ధతి మాత్రమేనా?
మహిళలు తమ హక్కును పొందేందుకు పోరాటం చేయాల్సి వస్తూనే ఉంది. అందులో డ్రైవింగ్ కూడా ఒకటి. ఈ మాట వినేందుకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నా.. జూన్ 2018 వరకు సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేయకుండా నిషేధించబడ్డారనేది వాస్తవం. ఆ దేశ ప్రభుత్వం పితృస్వామ్య నియమాలను విశ్వసించడమే ఇందుకు కారణం కాగా.. స్త్రీలు మగ సంరక్షకులు లేకుండా ప్రయాణించకూడదనే నిబంధన ఉండేది. అక్కడ ఇది రూల్ అయితే.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజల మూఢ నమ్మకం, మూస ధోరణి. మహిళలు ఒంటరిగా ప్రయాణించకూడదని, పురుషుల డ్రైవింగ్ సహాయం తీసుకోవాలని ఇప్పటికీ తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు. దీంతో ముందు నుంచి కూడా కుటుంబంలో అబ్బాయిలు డ్రైవింగ్ చేసేవారు కాబట్టి అమ్మాయిలకు తక్కువ అవకాశాలు ఇవ్వబడ్డాయి. డ్రైవింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
అపోహ మాత్రమే!!
పితృస్వామ్యం కేటాయించిన లింగ పాత్రల కారణంగా అమ్మాయిలు ఇంటికి పరిమితమై కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటే.. అబ్బాయిలు ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. తద్వారా పురుషులతో పోలిస్తే మహిళలు డ్రైవ్ చేసేందుకు తక్కువ అవకాశాలు పొందారు. కానీ కాలం మారుతోంది. మహిళలు కూడా జాబ్స్ చేస్తున్నారు. తామేంటో నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో వర్క్ ఫోర్స్‌లో స్త్రీల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. కానీ నేటికీ మహిళలు డ్రైవింగ్ చేయలేరనే నిరాధారమైన నమ్మకాలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.
నివేదికలు ఏం చెప్తున్నాయి?
డ్రైవింగ్ చేయడంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా ప్రాణాంతక ప్రమాదాలకు గురవుతున్నారని చెప్తున్నాయి. నివేదికల ప్రకారం 2017లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మేల్ అండ్ ఫిమేల్ డ్రైవర్ల సంఖ్య దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, ట్రాఫిక్ నేరాలకు సంబంధించిన మొత్తం జరిమానాల్లో 72% పురుషులే బాధ్యులుగా ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంలో 84%, ఓవర్ స్పీడ్‌తో 78% కేసులు అబ్బాయిల మీదే నమోదయ్యాయి. అంటే పురుషులతో పోలిస్తే మహిళలు ఎంత సురక్షితమైన డ్రైవర్లు అనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయన ఫలితాలు సరిపోతాయి. అయినా సరే మహిళలు చెడ్డ డ్రైవర్లుగా పరిగణించబడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. తద్వారా మహిళల వల్లనే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయనే తప్పుడు ఆలోచనను ప్రమోట్ అవుతోంది.
తప్పుడు ప్రచారం
ఈ స్టిరియోటైప్స్ కారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, వారు ఎందుకు డ్రైవింగ్ చేయాలనే ప్రజల ఆలోచన కూడా ఇందుకు కారణం. ఈ మూస పద్ధతులన్నీ ఏదో ఒక విధంగా స్త్రీలను, వారి ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి వాటిని బహిష్కరించడం అత్యంత అవసరం. మహిళల డ్రైవింగ్ నైపుణ్యాలపై జోక్ వేయడం, కామెంట్స్ చేయడం ద్వారా ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అందుకే ఈ నమ్మకం నిరాధారమైనదని, ఏ శాస్త్రీయ అధ్యయనం దీనిని నిరూపించలేదని గుర్తుంచుకోవాలి. డ్రైవింగ్‌లో బెస్ట్ అనేది లింగం ఆధారంగా నిర్ణయించబడదని అర్థం చేసుకోవాలి. క్యాబ్, ఆటో డ్రైవర్లుగా కుటుంబానికి జీవనాధారంగా ఉన్నారని ఆలోచించాలి.
READ MORE
వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను అందిస్తున్న కిటికీలు..శాస్త్రవేత్తల సృష్టి