ఏసు చెప్పాడని విమానం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన మహిళ.. 37వేల అడుగుల ఎత్తులో..

by sudharani |   ( Updated:2022-12-11 13:46:17.0  )
ఏసు చెప్పాడని విమానం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన మహిళ.. 37వేల అడుగుల ఎత్తులో..
X

దిశ, ఫీచర్స్: జీసస్ చెప్పాడని విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించింది యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన ఓ మహిళ. ఎయిరో ప్లేన్ 37వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సైడ్ డోర్‌ ఓపెన్ చేసేందుకు యత్నించగా నిర్బంధించారు. అయినా సరే ఆమె విమానంలో ఫ్లోర్‌కు తల బాదుకుంటుండటంతో చివరికి ప్లేన్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. నవంబర్ 26న, సౌత్‌వెస్ట్ ఫ్లైట్ 192 టెక్సాస్‌లోని హ్యూస్టన్ నుంచి కొలంబస్, ఒహియోకి ప్రయాణిస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఎలోమ్ అగ్బెగ్నినౌ అనే 34 ఏళ్ల మహిళ విమానం తలుపు తెరవమని యేసు తనకు సూచించాడని, కిటికీలో నుంచి చూడమని కోరాడని ఫ్లయిట్ అటెండెంట్స్‌కు తెలిపింది. దీనికి నిరాకరించిన వారు.. రెస్ట్ రూమ్‌కు వెళ్లి కాస్త రిలాక్స్ కావాలని సూచించారు.

కానీ ఎగ్జిట్ డోర్‌ను తదేకంగా చూసిన ఆమె.. వారిని ముందుకు నెట్టేసి తలుపు హ్యాండిల్‌ను లాగుతూ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతని తొడపై కొరికింది. తర్వాత జెట్ ఫ్లోర్‌పై తలను బాదుకుంటూ యేసయ్య డోర్ తెరవమని చెప్పాడని అరుస్తూనే ఉంది. దీంతో పైలట్ లిటిల్ రాక్ బిల్ అండ్ హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. కాగా తాను మేరీ ల్యాండ్‌లో ఫ్యామిలీ ఫ్రెండ్‌ను చూసేందుకు ఇంట్లో చెప్పకుండానే వెళ్తున్నట్లు పోలీసులకు తెలిపింది ఎలోమ్. తాను చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యానని, ప్రయాణం చేయలేదని తెలిపిన ఆమె.. ఇలాంటి పనులు గతంలో ఎప్పుడూ చేయలేదని చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed