DIVORCE PARTY: పెళ్లి కన్నా ఘనంగా విడాకుల పార్టీ... ఆ హార్ట్ ఫుల్ డ్యాన్స్ కు ఫిదా అయిపోవాల్సిందే...

by Sujitha Rachapalli |
DIVORCE PARTY: పెళ్లి కన్నా ఘనంగా విడాకుల పార్టీ... ఆ హార్ట్ ఫుల్ డ్యాన్స్ కు ఫిదా అయిపోవాల్సిందే...
X

దిశ, ఫీచర్స్: దాదాపు ప్రతి పెళ్లి ఘనంగానే జరుగుతుంది. బంధువులు, స్నేహితులకు ఆహ్వానం పంపించి.. కనీసం వారం రోజులపాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇతరుల ముందు తీసిపోకుండా తమ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా అప్పు చేసి మరీ గొప్పగా నిర్వహిస్తారు. అయితే ఇంత ఘనంగా పెళ్లిళ్లు.. పట్టుమని పదేళ్లు కూడా ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భర్త లేదంటే భార్య టార్చర్ చేయడం, ఇక వారితో ఉండలేమనే విధంగా ఎమోషనల్ గా డ్యామేజ్ చేయడం కారణంగా ఈ మధ్య విడాకుల కేసులు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన ఓ అమ్మాయి తాళికట్టిన హస్బెండ్ కు దూరమై డివోర్స్ తీసుకున్నందుకు.. పెళ్లికి మించిన గ్రాండ్ పార్టీ ఇచ్చింది.

ఈ సందర్భంగా ఆ మహిళ చేసిన హార్ట్ ఫుల్ డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతుంది. బ్లూ కలర్ లెహంగాలో ఉన్న ఆమె.. ఆ సంతోషంలో చున్నీ పడేసి మరీ స్టెప్స్ ఇరగదీసింది. డివోర్స్ ముబారక్ పేరుతో పార్టీ అరేంజ్ చేసి.. ఫ్రెండ్స్, చుట్టాలని ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. కాగా ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇలాంటి అమ్మాయిని వదులుకున్నందుకు ఆమె భర్తను అప్రిషియేట్ చేయాలంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. 'ఇది నీ జీవితం.. దాన్ని హ్యాపీగా మలుచుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ ' అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed