- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Winter vacation : మంచు కురిసే వేళలో.. అందమై కొండల్లో..
దిశ, ఫీచర్స్ : శీతాకాలంలో కాస్త చలి ఎక్కువగా ఉంటుంది. కానీ విహార యాత్రలకు అనువైన కాలం కూడా ఇదే. ఉదయపు వేళ వాతావరణంలో, మంచు కురుస్తున్న సమయంలో ప్రకృతి అందాలను, అందమైన పర్వత ప్రాంతాలను ఆస్వాదించాలని చాలా మంది కలలు గంటుంటారు. కొంగ్రొత్త ప్రదేశాలను చుట్టి రావాలని భావిస్తుంటారు. అలాంటి ఔత్సాహికులకోసం మనదేశంలోనే ఆకట్టుకునే హిల్ స్టేషన్‌లు చాలానే ఉన్నాయి. అవి ఏవి? ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భీమ్ తల్
భీమ్ తల్ (Bhimtal) ఢిల్లీకి సమీపంలో గల ఉన్న అందమైన హిల్ స్టేషన్ ఇది. సముద్ర మట్టానికి 450o అడుగుల ఎత్తులో ఉన్న ఈ అందమైన కొండ ప్రాంతం నైనిటాల్ నుంచి చాలా దగ్గర అవుతుంది. ఎప్పుడూ పచ్చదనంతో, సుందరమైన ప్రకృతి అందాలతో కనువిందు చేసే భీమ్తాల్ విహార యాత్రికులను బాగా ఆకట్టుకుంటుంది. భీమ్తాల్ అంటే కేవలం హిల్ స్టేషన్ మాత్రమే అనుకోకండి. దానిపై అందమైన సరస్సు కూడా ఉంది.
కాంగ్రా
కాంగ్రా (Kangra) : ఎత్తైన కొండపై ఉండే ఈ అందమైన పట్టణం హిమాల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉంది. నాగర్ కోట్ అని కూడా పిలుస్తారు. దీనికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉందంటారు నిపుణులు. అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రంథంలో దీని ప్రస్తావన ఉన్నందున పురాతన గ్రామంగా పేర్కొంటారు. ఇదంతా పక్కన పెడితే అందమైన ప్రకృతి దృశ్యాలతో ఆకట్టుకుటుంది కాంగ్రా హిల్ స్టేషన్. ముఖ్యంగా ఉదయం పూట మంచు కురుస్తున్న సమయంలో దీనిని చూడటానికి ఇష్టపడుతుంటారు పర్యాటకులు.
ధర్మశాల
ధర్మశాల (Dharamsala) ఇది కూడా భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం. హిమాలయాల అంచున ఎత్తైన కొండపై ఉంటుంది. అందమైన దేవదారు వృక్షాలతో, పచ్చిక బయళ్లతో ఆకట్టుకుంటుంది. ఈ కొండ ప్రాంతం దలైలామా, పలువురు టిబెటన్ బౌద్ధ సన్యాసులకు నిలయంగానూ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడి థెక్చెన్ చోలింగ్ టెంపుల్ కాంప్లెక్స్ టిబెటన్ బౌద్ధమతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ముఖ్యంగా 14వ దైలైలామా నివసించే నామ్ గ్యాల్ మోనాస్టరీ సందర్శకులను ఆకట్టుకుంటుంది. దీనినే ధర్మశాల అని కూడా అంటారు. వింటర్‌లో ఈ ప్రాంతాన్ని చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.
కసౌలి
కసౌలి (Kasauli) ఉత్తర భారత దేశంలోని ఒక అందమైన కొండప్రాంతం.1842లో బ్రిటీష్ వాళ్లు డెవలప్ చేసిన ఈ కంటోన్మెంట్ సిటీ 19వ శతాబ్దపు మధ్యకాలం నాటి కలోనియల్ - యుగం ఇండ్లు, తోటలు, పచ్చని పైకప్పుగల టెర్రస్‌లకు నిలయంగా ఉంది. అలాగే దీని దక్షిణంవైపు మంకీ పాయింట్, హిమాలయన్ అడవులు ఉంటాయి. ఇవన్నీ ఎల్లప్పుడూ పచ్చని ప్రకృతి అందాలతో అలరిస్తుంటాయి. మంచు కురుస్తున్నప్పుడు ఈ ప్రాంతం చూడటానికి ఎంతో మంది ఇష్టపడతారు. అక్కడి కొండపై ఒక చిన్న ఆలయం కూడా ఉంది.
నహాన్
హిమాల్ ప్రదేశంలోని ఒక అందమైన పట్టణం నహాన్. సిర్మౌర్ జిల్లాలో ఉంది. ఇక్కడి హిల్ స్టేషన్ అంతా శివాలిక్ పర్వత శ్రేణితో, అందమైన పచ్చటి పొలాలతో కళళలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి చెరువులు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ హిల్ స్టేషన్ 1621లో రాజా కరన్ ప్రకాశ్ ద్వారా రాజధానిగా స్థాపించబడిందని చెప్తారు. పురాణాల ప్రకారం నహాన్ (Nahan) అనే పేరుగల సాధువు ఈ పేరు పెట్టారని కూడా ప్రచారంలో ఉంది. అందమైన సరస్సులు, పచ్చని ప్రకృతి దృశ్యాలు, పక్షుల కిల కిల రావాలు, రంగు రంగుల పువ్వులతో నిండిన ఉద్యానవనాలు, పురాతన దేవాలయాలు ఆకట్టుకుంటాయి. వింటర్‌లో చాలామంది ఇక్కడికి వస్తుంటారు.
ఫాగు
ఫాగు (Fagu).. సిమ్లా నుంచి 45 నిమిషాల్లో చేరుకోగల ఈ అందమైన హిల్ స్టేషన్ ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఒక చిన్న కుగ్రామం. దట్టమైన పొగమంచుతో, అందమైన చెట్లతో, సరస్సులతో ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఎప్పుడూ రణగొణ ధ్వనుల నగర జీవితంతో, వాయు, శబ్ద, కాంతి కాలుష్యంతో దూరంగా వెళ్లి గడపాలనుకునే వారికి ఇదొక మంచి టూరిస్ట్ స్పాట్. కాబట్టి శీతాలకాంలోనే ఇక్కడికి విహార యాత్రకోసం దేశ, విదేశాల నుంచి పలువురు వస్తుంటారు.
కనాతల్
కనాతల్ భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గల ఒక అందమైన హిల్ స్టేషన్. డెహ్రాడూన్ నుంచి 78 కి.మీ. ముస్సోరి నుంచి 12 కి.మీ, అలాగే చంబా నుంచి 18 కి.మీ దూరంలో ఉంది. శీతాకాలంలో కనాతల్(Kanatal)ను చూడటానికి చాలామంది ఇష్టపడతారు. ఉదయంపూట మంచు కురుస్తున్నప్పుడు ఇక్కడి ప్రకృతి అందాలు భలే ఆకట్టుకుంటాయి. చూసే కొద్దీ మధురానుభూతికి గురిచేస్తాయి. అందమైన అడవులు, పర్వతాలు, లోయలు, వాగులు విహార యాత్రకులను అమితంగా ఆకట్టుకుంటాయి. వింటర్‌లో టూర్ ప్లాన్ చేసుకునే భారతీయ పర్యాటకుల లిస్టులో ఈ హిల్ స్టేషన్ తప్పక ఉంటుందనడం అతిశయోక్తి కాదు.
రాణీఖేత్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ హిల్ స్టేషన్ అందమైన పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జూలాదేవి ఆలయం పేరుతో దుర్గామాత టెంపుల్ ఉంది. అలాగే చౌబాటియా గార్డెన్ ఆకట్టుకుంటుంది. ఇక రాణీఖేత్ సమీపంలోని తారిఖేత్ గ్రామంలో స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మా గాంధీ కుటీ (గుడిసె)లో బస చేశారని మనం చదువుకున్నాం కదా.. అది ఇక్కడే ఉంది. అందమైన పచ్చిక బయళ్లు, అరుదైన వృక్షజాలం, వన్య ప్రాణులకు నిలయంగా ఉన్న రాణిఖేత్ (Ranikhet) పర్యాటకులను కట్టిపడేస్తుంది. గంభీరమైన హిమాలయ పర్వత శ్రేణులతో నిండి ఉన్న ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1869 మీటర్ల ఎత్తులో ఉంది. ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకోవడం చాలా ఈజీ. శీతాకాలంలో, ముఖ్యంగా మంచు ఎక్కువగా కురిసే శరదృతువులో ఈ హిల్ స్టేషన్‌ను పర్యాటకులు సందర్శిస్తుంటారు.