- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కిన్ గ్లోయింగ్ వైన్ ఫేషియల్..!
దిశ, ఫీచర్స్: సాధారణంగా ఫేషియల్స్ అనేవి డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి, ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. కాబట్టి నెలకు ఒకటి, రెండుసార్లు అయినా ఫేషియల్ చేయించుకోవడానికి చాలామంది మహిళలు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం గోల్డెన్ ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్, మడ్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్స్‌తోపాటు వైన్ ఫేషియల్ ట్రెండ్ నడుస్తోంది. ద్రాక్ష పండ్లను వైన్ ఫేషియల్‌లో ప్రధానంగా వాడుతారు.
ఎందుకంటే వీటి గింజలు, ఆకులు, గుజ్జు వంటివి స్కిన్ గ్లోయింగ్ నెస్‌కు తోడ్పడతాయి. విటమిన్ ఎ, సి, డి పుష్కలంగా ఉండటంవల్ల మేలు చేస్తాయి. అమినో యాసిడ్, మినరల్స్ కూడా ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వైన్ ఫేషియల్‌లో ఉపయోగిస్తారు. ద్రాక్షతో తయారు చేసిన ఎరుపు, గులాబీ, తెలుపు వైన్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్ పుష్కలంగా ఉండటంవల్ల సౌందర్య చికిత్స కోసం ఉపయోగిస్తారు.
ముఖ సౌందర్యానికి..
వేసవిలో చాలామంది వైన్ ఫేషియల్‌ను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఎండవల్ల ముఖం పాలిపోయి, చర్మం కందిపోయి ఇబ్బందిగా మారే చాయిస్ అధికంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వైన్ ఫేషియల్ బాగా పనిచేస్తుంది. ఈ ఫేషియల్‌లో ముఖాన్ని శుభ్రపరచడం, టోన్ చేయడం, స్క్రబ్ చేయడం, సాధారణ ఫేషియల్ లాగా మసాజ్ చేయడం వంటివి చేస్తారు. అయితే ఇతర ఫేషియల్స్ కంటే వైన్ ఫేషియల్ హై స్కిన్ గ్లోను ఇస్తుంది. దీంతోపాటు శరీరాన్ని కాంతివంతం చేయడానికి, శరీరంలోని ముడతలు పోవడానికి ప్రస్తుతం వైన్ థెరపీ కూడా అందుబాటులో ఉందంటున్నారు బ్యుటీషియన్లు.
చర్మ సౌందర్యానికి..
నల్ల ద్రాక్ష గింజలను మెత్తగా చేసి శరీరమంతా పూయాలి. ఇది స్క్రబ్బర్ లాగా పని చేయడంవల్ల మృతకణాలు, మురికి తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. దీని తర్వాత వైన్ కలిపిన జెల్ లేదా క్రీములను శరీరమంతా అప్లై చేయాలి. చివరగా.. వైన్ సీరంను వర్తింపజేస్తే చర్మంపై రంధ్రాలు మూసుకుపోతాయి.
స్కిన్ కాంతివంతంగా మారుతుంది. వైన్ ఉపయోగించి బ్యూటీ ట్రీట్ మెంట్స్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవల్సింది ఏంటంటే... పొడి చర్మం ఉన్నవారు స్వీట్ వైన్ వాడాలి, వైట్ వైన్ వాడొద్దు. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు రెడ్ వైన్ వాడటంవల్ల ఇది చర్మ రంధ్రాలలోకి వెళ్లి మొటిమలు, వీనల్ ట్యూమర్‌లను నివారిస్తుంది. డ్రై వైన్ సాధారణ చర్మం కోసం ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై జిడ్డును పోగొట్టి అదనపు షైనింగ్‌ను ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
అందం, అదృష్టం, తెలివితేటలు ఈ రాశుల అమ్మాయిలకే సొంతం.. మీరాశి ఉందేమో చూసుకోండి