Earth: ఏనాటికైనా ఈ భూమి తిరగడం ఆగిపోతుందా..? అప్పుడేం జరుగుతుంది?

by Javid Pasha |
Earth: ఏనాటికైనా ఈ భూమి తిరగడం ఆగిపోతుందా..? అప్పుడేం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్ : భూమి తనచుట్టూ తాను తిరుగుతుందన్న విషయం తెలిసిందే. 450 ఏండ్ల క్రితం అది ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. విశ్వంలోని వివిధ గ్రహాల నడుమ ఉండే ఆకర్షణ, వికర్షణ శక్తులు, బలాలు, చంద్రుడి ప్రభావం, సముద్రాల్లోని అలలు, అలజడులు ఇవన్నీ భూ భ్రమణానికి కారణం అవుతున్నాయి. అందుకే మనకు 24 గంటల్లో రాత్రీ పగలు సంభవించి ఒక రోజు పూర్తవుతుంది. వాతావరణ మార్పులు, ప్రకృతి నియమాలు కూడా భూమి తిరగడంపైనే ఆధారపడి ఉంటాయంటున్నారు నిపుణులు. అయితే ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే.. అప్పుడు ఏం జరుగుతుందన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా?.. దీనికి శాస్త్రవేత్తల సమాధానం ఏమిటో చూద్దాం.

ఒక యంత్రం లేదా చక్రం తిరగాలంటే దానికి కొంత ఇంధనం, మానవ ప్రయత్నం వంటి డ్రైవింగ్ ఫోర్స్ అవసరం. కానీ భూమికి అలాంటివి అవసరం లేదు. సహజ సిద్ధంగా ఈ ప్రకృతి, విశ్వం ఏర్పడిన సూత్రాలపై ఆధారపడి అది కంటిన్యూ తిరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఏ కొద్దిసేపు కూడా ఆగిపోదు. కానీ.. ఒకవేళ సడెన్‌గా ఆగిపోతే.. అప్పుడు ఈ భూమిపై ఉన్న మనుషులు, ఇతర జీవులు, వస్తువులు అన్నీ అంతరిక్ష కేంద్రంలోని ఆకర్షణ శక్తికి లోనై అక్కడికి ఎగిరిపోతామని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే భూమిపై పెద్ద పెద్ద రాళ్లు, వాహనాలు, వస్తువులు వేగంగా అంటే.. గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో ఒకదానికొకటి ఢీకొంటాయట. సముద్రాల్లోని నీరు, పర్వతాలపైన ఉండే మంచు ఒక్కసారిగా ఆకాశంవైపు దూసుకెళ్లి తిరిగి భూమిపై పడే చాన్స్ ఉంటుంది. ఫ్యాక్టరీలు, పవర్ గ్రిడ్లు, అణు విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ నెట్వర్కులు ఏవీ పనిచేయవు. మొత్తానికి భూమిపై జీవరాశే మిగలదని సైంటిస్టులు అంటున్నారు. అయితే ఇదంతా ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే మాత్రమే.. కానీ అది ఎన్నటికీ జరగకపోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది.

Advertisement

Next Story

Most Viewed