- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూగ్రహాన్ని సూర్యుడు మింగేస్తాడా ? కొత్త అధ్యయనం ఏం చెప్తోంది..!
దిశ, ఫీచర్స్: సూర్యగ్రహం ఒక అగ్ని గోళం. అణు భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా పనిచేస్తూ భూమిపై జీవితాన్ని శక్తివంతం చేస్తుంది. కానీ ఎప్పుడూ ఇదే రకంగా ఉండకపోవచ్చు. సూర్యుడి హైడ్రోజన్ ఇంధనం మొత్తాన్ని ఖర్చుచేసే సమయం వస్తుంది. అప్పుడు సంభవించే పరిణామాలను ఊహించడం కష్టం. ఇప్పటి నుంచి దాదాపు ఐదు బిలియన్ సంవత్సరాల తర్వాత ఇంధనం అయిపోయాక సూర్యగ్రహం ఎర్రటి జెయింట్‌గా మారిపోతుంది. జీవితాన్ని కొనసాగించే సామర్థ్యం కోల్పోవడంతో పొరుగున ఉన్న సౌర వ్యవస్థలో చివరి వేట కోసం బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో బుధుడు, శుక్రుడు, భూగ్రహాలను సూర్యుడు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత తలెత్తే పరిస్థితుల గురించి శాస్త్రవేత్తలు కొత్త అధ్యయనంలో వెల్లడించారు.
రాయల్ ఆస్ట్రోనామికల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. సూర్యుడి వంటి నక్షత్రం యొక్క బయటి వాతావరణంలో వేడి వాయువుతో ఒక గ్రహం లేదా బ్రౌన్ డార్ఫ్(ఖగోళ వస్తువు) పరస్పర చర్యలు అనేవి ఖగోళ వస్తువు పరిమాణం, నక్షత్ర పరిణామ దశపై ఆధారపడి అనేక రకాల ఫలితాలకు దారితీస్తాయని పేర్కొంది. పరిశోధకులు ఒక స్టెల్లార్ ఎన్వలప్‌లో మునిగిపోయిన గ్రహ సమీపంలో ప్రవాహానికి సంబంధించి త్రిమితీయ హైడ్రో డైనమిక్ అనుకరణలను ప్రదర్శించారు. సూర్యుడు తన గ్రహాలను మింగేసినపుడు అది సూర్యుని లాంటి నక్షత్ర ప్రకాశాన్ని వేల సంవత్సరాల వరకు అనేక దశల పరిమాణంలో పెంచుతుందని వారు కనుగొన్నారు. ఇది చుట్టుముట్టబడిన వస్తువు ద్రవ్యరాశి, సదరు నక్షత్రం పరిణామ దశపై ఆధారపడి ఉంటుంది.
గ్రహం.. నక్షత్రం లోపల ప్రయాణిస్తున్నప్పుడు డ్రాగ్ ఫోర్సెస్ గ్రహం నుంచి నక్షత్రానికి శక్తిని బదిలీ చేస్తాయి. బదిలీ చేయబడిన శక్తి దాని బంధన శక్తిని మించి ఉంటే స్టెల్లార్(నక్షత్ర) ఎన్వలప్ అన్‌బౌండ్ అవుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రధాన రచయిత రికార్డో యార్జా వివరించారు. అయినప్పటికీ, పరిణామం చెందిన నక్షత్రాలు వాటి గ్రహాల కంటే వందలు, వేల రెట్లు పెద్దవిగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్కేల్‌లో జరిగే భౌతిక ప్రక్రియలను ఖచ్చితంగా మోడల్ చేసే అనుకరణలను చేయడాన్ని కష్టతరం చేస్తుందని అతని బృందం పేర్కొంది.