30 ఏళ్లకే ఆ సమస్య వస్తుందా..? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

by Dishaweb |   ( Updated:2023-06-27 12:34:10.0  )
30 ఏళ్లకే ఆ సమస్య వస్తుందా..? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే!
X

దిశ,వెబ్‌డెస్క్ : మన పూర్వీకులు తిన్న ఆహారానికి.. ప్రస్తుతం మనం తింటున్న ఆహారానికి చాలా తేడా ఉంది. ఆనాటి మానవులకు ఈనాటి మానవులను ఆరోగ్య పరంగా పరిశీలిస్తే ఆ కాలంలో వ‌య‌సుపైబ‌డిన తరువాత ఎముక‌ల స‌మ‌స్య ఎదురయ్యేది. కాని ఇప్పుడు ఉన్న కాలంలో 30 దాటగానే ఎముక‌ల స‌మ‌స్య సర్వసాధణమైంది. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారలోపమేనని వైద్యులు పేర్కొంటున్నారు.

మనం ఏ పని చేసినా తొందరగా అలసిపోతాము. బాడీ పెయిన్స్ ఇబ్బంది పడతాము. దానికి కారణం ఎముకలు బలహీనపడటమే.. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం తప్పులు చేస్తున్నారో తెలుసుకోవాలి. ప్రతి రోజు నడక, యోగా చేయాలి. లేదంటే ఎముకలు బలహీనపడతాయి. ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలి. ఉప్పు, పులుపు ఎక్కువగా ఉన్న ఆహారాలకు ఎముకలను బలహీన పరిచే గుణం ఉంటుంది. సమయానికి నిద్రపోవాలి. ధూమపానం, మద్యపానం అలవాటును వదిలేయాలి. కాల్షియం ఎక్కువగా దొరికే ఆహారాన్ని తీసుకోవాలి.

ముఖ్యంగా వ‌య‌సుపైబ‌డిన పురుషులు, మ‌హిళ‌ల్లో ఎముక‌ల స‌మ‌స్య నివారించేందుకు త‌గినంత విట‌మిన్ డీ అవ‌స‌రం. క్యాల్షియంతో పాటు విట‌మిన్ డీ ఆస్టియోపోరోసిస్ నివార‌ణ‌, చికిత్సలో స‌హ‌కరిస్తుంది. విట‌మిన్ డీ పాలు, గుడ్లు, వెన్న, బ్రేక్‌ఫాస్ట్ సిరిల్స్‌, ఆరంజ్ జ్యూస్‌, పెరుగు వంటి ఆహార ప‌దార్ధాల్లో ల‌భిస్తుంది. ఇక క్యాల్షియం కూడా ఎముక‌లు ప‌టిష్టంగా ఉండేందుకు అవ‌స‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం డైరీ ఉత్పత్తులు, ఆకుకూర‌లు, చేప‌ల్లో అధికంగా ఉంటుంది. ఎముక‌లు ప‌ట్టుత్వానికి కీల‌క‌మైన ఫాస్పర‌స్ పాల ఉత్పత్తులు, మాంసం, చేప‌లు, న‌ట్స్‌లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది.

Read More..

Bone health :ఈ అలవాట్లను వెంటనే మానుకోండి.. లేదంటే మీ ఎముకలు బలహీనంగా అవుతాయి?

Advertisement

Next Story

Most Viewed