- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయే ఆలోచనలు స్నానం చేస్తున్నప్పుడే ఎందుకొస్తాయ్?
దిశ, ఫీచర్స్ : చాలామంది సంక్షిష్ట సమయంలో తలబద్దలు కొట్టుకున్నా సరే సమస్యకు పరిష్కారాన్ని పొందలేరు. కానీ బాత్రూమ్లో షవర్ చేస్తుండగా మెరుపులాంటి ఆలోచనలు తట్టడం కామన్. అయతే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రీయ కారణాలు తెలుసుకోలేకపోయిన శాస్త్రవేత్తలు.. తాజాగా ఈ మిస్టరీకి సమాధానం కనుగొన్నారు. మైండ్‌లెస్ టాస్క్(ఆలోచనలేని పనిలో నిమగ్నమైనప్పుడు)లో సంచరించే మెదడు సృజనాత్మక పరిష్కారాలతో ఎందుకు ముందుకు వస్తుందో వివరించారు.
సైకాలజీ ఆఫ్ ఈస్తటిక్స్, క్రియేటివిటీ అండ్ ది ఆర్ట్స్ జర్నల్‌లో ప్రచురించిన 'షవర్ ఎఫెక్ట్' పేపర్లో సంబంధిత వివరాలను ఫిలాసఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాక్ ఇర్వింగ్ తెలిపారు. తను యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా సైకాలజీ ప్రొఫెసర్ కైట్లిన్ మిల్స్, తదితరులతో కలిసి 222 & 118 మంది వ్యక్తులతో కూడిన రెండు గ్రూప్స్‌తో రెండు ప్రయోగాలు చేశారు. పార్టిసిపెంట్స్‌కు యాదృచ్ఛికంగా రెండు పనుల్లో ఒకటి కేటాయించబడింది. మొదటి గ్రూప్ 1980ల నాటి 'వెన్ హ్యారీ మెట్ సాలీ' చిత్రం నుంచి మూడు నిమిషాల నిడివి గల అట్రాక్టివ్ సన్నివేశాన్ని వీక్షించగా.. రెండో బృందం లాండ్రీని మడతపెట్టే పురుషుల మూడు నిమిషాల చలన చిత్రాన్ని చూసింది.
వీడియో విరామం తర్వాత.. పార్టిసిపెంట్స్ అందరికి కూడా వారి అసలు పనికి మరిన్ని ఆలోచనలను జోడించేందుకు గాను ఊహించని విధంగా 45 సెకన్లు అదనంగా ఇవ్వబడ్డాయి. వారి ప్రతిస్పందనలతో కూడిన క్రియేటివిటీని.. వారిలో కొత్తగా సంభవించిన, వాస్తవిక ఆలోచనల సంఖ్య ఆధారంగా నమోదు చేశారు. అయితే మరింత ఆకర్షణీయమైన చిత్రం వీక్షించిన సమయంలో మైండ్ సంచరించడం అనేది మరింత సృజనాత్మక ప్రతిస్పందనలతో సానుకూలంగా ముడిపడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి విరుద్ధంగా.. లాండ్రీ ఫిల్మ్ చూసిన పార్టిసిపెంట్స్ మిగతా గ్రూప్ కంటే తక్కువ ఆలోచనలను రూపొందించినట్లు కనుగొనబడింది.
మొత్తానికి ఈ ఫలితాల ప్రకారం.. ఆకర్షణీయమైన, బోరింగ్ పనుల సమయంలో వివిధ రకాల ఆలోచనలు సృజనాత్మక ఇంక్యుబేషన్‌ను నడిపిస్తాయని సూచిస్తున్నాయని రచయితలు నిర్ధారించారు. అంటే ఏదైనా పనిలో నిమగ్నమైనప్పటి కంటే బోరింగ్ పనులే ప్రయోజనకరంగా ఉండవచ్చని తేలింది. ఎందుకంటే అవి దృష్టి, అపరిమిత ఆలోచనల మధ్య డోలనం చేయడానికి అనుమతిస్తాయి.
ఇవి కూడా చదవండి :
రెయిన్ కోట్లో మహిళలు సెక్సీగా ఉంటారా.? చోరుడి వింత గాథ