- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎర్త్ అవర్ రోజు లైట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి?
దిశ,ఫీచర్స్ : ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్‌చే నిర్వహించబడే ప్రపంచవ్యాప్త ఉద్యమం.గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో పర్యావరణం పై ప్రజలకు మేలు కల్పించడం కోసమే ఈ అవగాహన కల్పిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.కాగా, ఈ ఏడాది కూడా మార్చి 23న రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. గంటపాటు తమ ఇళ్లు, కార్యాలయాల్లో లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫ్ చేయాలని కోరింది.
అయితే ఈ ఎర్త్ అవర్ సందర్భంగా ఎప్పుడూ రంగు రంగుల లైట్స్‌తో వెలుగులు జిమ్మే హైదరాబాద్ చీకటిమయం కానుంది.నగరంలోని హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, బీఆర్ అంబేద్కర్ విగ్రహం,దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి లాంటి ప్రదేశాల్లో శనివారం రోజు గంట పాటు లైట్లు ఆఫ్ చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఇక ఈ ఎర్త్ అవర్ అనే కార్యక్రమం 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభం అయ్యింది. సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్ గా దీన్ని మొదలు పెట్టారు. అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.కాగా, రాబోయే తరాలు ఆహ్లాదకరమైన ఉషోదయాలు చూడాలంటే ఇవాళ మనం ప్రకృతిని పాడు చేయకుండా కాపాడుకోవడమే ఈ లైట్స్ ఆఫ్ చేయడం.