- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LOVE - MARRIAGE - DIVORCE : చచ్చిపోయేంత ప్రేమ ఉన్నా.. పెళ్లి వర్క్ అవుట్ కాలేదు.. కారణాలు ఇవే...
దిశ, ఫీచర్స్: మనసు నిండా ప్రేమ... భాగస్వామి అంటే ఎనలేని గౌరవం... ఏది అడిగినా తెచ్చి పెట్టాలనే ఆరాటం.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుండు అనే ఆత్రుత.. పెద్దల అంగీకారంతో చివరికి అంగరంగ వైభవంగా వివాహం. కొద్దిరోజులు అంతా బాగానే ఉంటుంది. సినిమాలో చూపించినట్లుగా రొమాన్స్, ఒకరినొకరు ఇంప్రెస్ చేయడం, మరింత డీప్ లవ్ తో కనెక్ట్ అవడం... పెళ్లి బంధం ఇంత గొప్పగా ఉంటుందా అనే ఫీల్ రావడం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఇలాంటి అనుభూతి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ముందు భాగస్వామిపై చచ్చిపోయేంత ప్రేమ ఉన్నా.. కొన్నాళ్లకు విసుగువస్తుంది. విడిపోతేనే బాగుంటుందన్న ఆలోచన కలుగుతుంది. విడాకులతో ఆ పవిత్ర బంధానికి స్వస్తి పలకాల్సి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? నిపుణులు ఏం చెప్తున్నారు? తెలుసుకుందాం.
అటాచ్మెంట్ స్టైల్స్
అటాచ్మెంట్ స్టైల్స్ వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటాయి. సెక్యూరిటీ ఇచ్చే విధానం.. బాధ్యతలు తీసుకునే పద్ధతి.. ఇలా ప్రతి విషయం డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇవే భాగస్వాములు కమ్యూనికేట్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి. ఒకవేళ నచ్చకపోతే లేదంటే అర్థం చేసుకోలేకపోతే నెగెటివ్ ఎఫెక్ట్ కలిగిస్తాయి. భాగస్వాములు విభిన్న అటాచ్‌మెంట్ స్టైల్‌లను కలిగి ఉన్నప్పుడు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, వైరుధ్యాలను పరిష్కరించుకోవడం సవాలుగానే ఉంటుంది. ఇది తరచుగా ఇంటిమసీ, సపోర్ట్ వంటి అంశాలతో ముడిపడుతూ సంబంధంలో సంతృప్తి లేకుండా చేస్తుంది. ప్రతి విషయం సమస్యగా మారేందుకు దారితీస్తుంది.
పరిష్కరించబడని గత గొడవలు
వివాహాలు విఫలం కావడానికి మరొక ప్రధాన కారణం పరిష్కరించని విభేదాలు. పెళ్లి వంటి సున్నితమైన సంబంధంలో.. సరిగ్గా పరిష్కరించకపోతే చిన్న సమస్యలు కూడా హానికరంగా మారవచ్చు. కాలక్రమేణా ఈ గొడవలు పేరుకుపోతాయి, ప్రవర్తన, కమ్యూనికేషన్‌పై ప్రభావం చూపుతాయి, తరచుగా వాదనలు, ఎమోషనల్ డిస్ కనెక్షన్ కు దారితీయవచ్చు. కాబట్టి స్ట్రాంగ్ అండ్ సపోర్టివ్ రిలేషన్ మెయింటైన్ చేసేందుకు ఇలాంటి చిన్న చిన్న వివాదాలను ఎప్పటికప్పుడు ఆరోగ్యకరంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ పద్ధతి బంధం శాశ్వతంగా నిలబడేలా చేస్తుంది.
చేజేతులా నాశనం చేసుకోవడం
కొందరిలో బాల్యంలో లేదా ప్రతిరోజూ తల్లిదండ్రుల ప్రవర్తన చూడటం వల్ల కలిగే గాయాలు, భయాలు... తమ మ్యారేజ్ లైఫ్ లోనూ జరుగుతాయనే భయంతో ఉండేలా చేస్తాయి. ఎమోషనల్, ఫిజికల్ రెండు విధాలుగా భాగస్వామితో కనెక్ట్ అయ్యేందుకు ఆలోచించేలా చేస్తాయి. ఇలాంటి పద్ధతి ఎదుటివారికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. పలు అనుమానాలకు దారితీయవచ్చు . ఒకవేళ ముందు అర్థం చేసుకున్నా అదే ప్రవర్తన కొనసాగితే విసుగు రావచ్చు. మొత్తానికి మంచి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకునే పరిస్థితికి కారణం కావచ్చని చెప్తున్నారు నిపుణులు.
ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక పోవడం
క్లిష్ట పరిస్థితుల్లో మానసికంగా తమను తాము నియంత్రించుకునే విధానం.. వివాహంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి తమ భావోద్వేగాలను నిర్వహించడం, అర్థం చేసుకోవడం, సరిగ్గా డీల్ చేయడంలో ఇబ్బంది ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఇది తరచుగా ఎమోషనల్ డ్యామేజ్, కోపం, నిశ్శబ్దం, అవాయిడ్ చేయడం వంటి చర్యలకు దారి తీస్తుంది. ఇటువంటి ప్రవర్తనలు ఉద్రిక్తత, ఒత్తిడిని సృష్టిస్తాయి, భాగస్వాములు సమర్థవంతంగా కమ్యూనికేట్ కావడం, స్థిరమైన, సహాయక సంబంధాన్ని కొనసాగించడం కష్టంగా మారుతుంది. ఇలా కాకుండా ఇద్దరు చర్చించుకుని ఆ సిచుయేషన్ ను హెల్తీగా డీల్ చేయొచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
జీవితంలో మార్పులు
తల్లిదండ్రులుగా మారడం, వృత్తిని మార్చుకోవడం లేదా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం వంటి ప్రధాన జీవిత మార్పులు సంబంధాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులను కలిసి ఎదుర్కొనేందుకు దంపతులు దృఢంగా లేకుంటే లేదా సిద్ధంగా లేకుంటే... వివాహాన్ని దెబ్బతీస్తుంది. వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. కనెక్షన్, కమ్యూనికేషన్ రెండు తగ్గిపోవచ్చు. రిలేషన్ వీక్ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుందనే ఆలోచన పుట్టి ఉండొచ్చు. అల్టిమేట్ గా విడాకులకు కారణం అయ్యుండొచ్చు.