భారతీయులకు అంత కోపం ఎందుకు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు షాక్ ఇస్తున్న ఇండియన్స్

by Sujitha Rachapalli |
భారతీయులకు అంత కోపం ఎందుకు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు షాక్ ఇస్తున్న ఇండియన్స్
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో రక్తపోటు రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. WHO ప్రకారం ఇండియాలో 22 కోట్ల మంది ప్రజలు బీపీతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం దేశంలో 25 నుంచి 54 సంవత్సరాల వయస్సు గల వారిలో 35.6 శాతం మందికి హైబీపీ ఉంది. కాగా ఈ హైపర్‌టెన్షన్‌ని సైలెంట్ కిల్లర్ గా ట్రీట్ చేస్తున్న నిపుణులు జాగ్రత్తలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు. హై బ్లడ్ ప్రెజర్ వల్లే ఎక్కువ కోపం వస్తుందని చెప్తున్నారు.

తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు నుంచి రక్తం కారడం, తీవ్ర ఆందోళన, మెడ నరాలు లాగడం వంటివి హై బ్లడ్ ప్రెజర్ లక్షణాలు. కాగా దీనివల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, దృష్టి కోల్పోవడం, మూత్రపిండాల డ్యామేజ్, అంగస్తంభన సమస్యలు, మెమరీ లాస్, పక్షవాతం, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని చెప్తున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed