- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గర్ల్‌ఫ్రెండ్ ఫొటోలను బాయ్స్ ఆన్‌లైన్‌లో ఎందుకు పోస్ట్ చేయరు?
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా వాడకం విషయంలో ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కొందరికి జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పోస్ట్ చేయడం అలవాటైతే మరికొందరేమో ఇలాంటివన్నీ చాలా లైట్ తీసుకుంటారు. ఇక డేటింగ్ విషయంలో ఈ సంక్లిష్టతలు మరింత క్లిష్టంగా ఉంటాయి. చాలా మంది అబ్బాయిలు తమ గర్ల్‌ఫ్రెండ్స్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు వెనకడుగు వేస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారో వివరించాడు ఓ యువకుడు.
టిక్‌టాక్ యూజర్ టామ్ హాల్జ్ ప్రకారం.. అబ్బాయిలు వారి కథనాల్లో అమ్మాయిల ఫొటోలు పోస్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం 'ఇబ్బంది(Embarrassmnet)' అని వివరించాడు. తాను అబద్ధం చెప్పట్లేదని.. ఎవరైనా తమ గర్ల్ ఫ్రెండ్ ఫొటో పోస్ట్ చేయడం లేదంటే తనను పబ్లిక్‌గా చూపించేందుకు సిగ్గుపడుతున్నారనేది వాస్తవమని పేర్కొన్నాడు. అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ దగ్గర గొప్పగా చెప్పుకుని 10/10 మార్క్స్ కేటాయిస్తారు. పైగా తాము కూడా అలాగే ఫీలవుతారు. కానీ పబ్లిక్ పోస్టింగ్ విషయానికొస్తే.. జనాలు అలా అనుకోరని వెనకడుగు వేస్తారు. ఇదంతా చెప్పుకొచ్చిన టామ్.. చివరగా అమ్మాయిలను క్షమించమని కోరాడు. ఇక ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
'అవును! నా పార్ట్‌నర్ తన ఎక్స్ లవర్స్ గురించి ఎప్పుడూ పోస్ట్ చేయలేదు' అని ఒక యూజర్ పేర్కొనగా.. ఇతర అమ్మాయిలకు అందుబాటులో ఉండాలనే గర్ల్ ఫ్రెండ్ ఫొటోలు పోస్టు చేయరని మరొక యూజర్ అభిప్రాయపడ్డాడు.