తెల్ల జుట్టు ఎందుకొస్తుందో తెలుసా..? ఇదిగో నివారణ మార్గం..

by Prasanna |   ( Updated:2023-04-21 10:09:32.0  )
తెల్ల జుట్టు ఎందుకొస్తుందో తెలుసా..? ఇదిగో నివారణ మార్గం..
X

దిశ, ఫీచర్స్: మనలో ఎక్కువ మంది మన నెరిసిన జుట్టుకు రంగు వేస్తారు.దీన్ని వృద్ధాప్య సంకేతంగా పరిగణిస్తారు. గాలి కాలుష్యం, కల్తీ ఆహారం కారణంగా చిన్న వయసులోనే చాలా మందిని ఈ సమస్య వేధిస్తుండగా.. దీనికి పరిష్కారాన్ని కనుగొనడంపై పనిచేశారు న్యూయార్క్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. మెలనిన్ ఉత్పత్తి చేసే మూలకణాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జుట్టు నెరిసిపోతుందని కొన్ని అధ్యయనాలు చెప్తే.. ప్రోటీన్ అండ్ ఐరన్ లోపం వల్లే ఇలా జరుగుతుందని మరికొన్ని నివేదించాయి. కానీ హెయిర్ ఫోలికల్స్‌లోని గ్రోత్ కంపార్ట్‌మెంట్ల మధ్య కదిలే స్టెమ్ సెల్స్‌పై ఈ ప్రక్రియ ఆధారపడుతుందని న్యూ రీసెర్చ్ తెలిపింది. కణాలు కదిలే సామర్థ్యాన్ని కోల్పోవడం మూలంగా గ్రే హెయిర్ వస్తుందని వివరించింది.

ఎలుకలపై చేసిన కొత్త అధ్యయనం జుట్టు నెరిసిపోవడానికి సంబంధించిన సమస్యలను వెల్లడించింది. మెలనోసైట్ స్టెమ్ సెల్స్ లేదా McSC లు అని పిలువబడే కణాలు ఇందుకు కారణమని తెలిపారు సైంటిస్టులు. అయితే కొత్తగా కనుగొన్న మెకానిజమ్ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ ఫిక్స్‌డ్ పొజిషన్స్‌ను అలాగే ఉండేలా చేస్తుందని.. అభివృద్ధి చెందుతున్న హెయిర్ ఫోలికల్ కంపార్ట్‌మెంట్‌ల మధ్య జామ్‌డ్ కణాలు మళ్లీ కదలడానికి సహాయపడటం ద్వారా జుట్టు నెరసిపోవడాన్ని నిరోధిస్తుందన్నారు. త్వరలోనే గ్రే హెయిర్ రివర్స్‌ అయ్యే చాన్స్ ఉందన్నారు.

Read more:

ఈ చిట్కాలతో నోటిపూతకు చెక్ పెట్టండి..!

మిమ్మల్ని మానసికంగా వీక్ చేసే అలవాట్లు ఏంటో తెలుసా..?

Advertisement

Next Story