- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముద్దు.. ప్రేమ వ్యక్తీకరణ: తెరపై పిల్లలు కిస్ సీన్స్ చూడకుండా ఆపడం కరెక్టేనా?
దిశ, ఫీచర్స్: పిల్లలతో కలిసి ముద్దు సన్నివేశాలు చూడటం చాలా మంది తల్లిదండ్రులను డైలమాలో పడేస్తుంది. తమ పిల్లలను అలాంటి దృశ్యాలను చూడనివ్వాలా లేదా? సాన్నిహిత్యం గురించి చర్చించాలా వద్దా? అనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతుంటారు. ఒకవేళ చూడాల్సి వస్తే.. తర్వాత వారు చేయాల్సిన పనేంటి? తప్పుడు కంటెంట్‌తో పిల్లల మనసు చెడిపోకుండా సెక్స్ గురించి ఎలా మాట్లాడాలి? మంచి-చెడు కంటెంట్ మధ్య ఉన్న సన్నని గీతను ఎలా వివరించాలి? తెలుసుకుందాం.
ఇద్దరు పిల్లల తల్లి.. ఇలాంటి కిస్ లేదా ఇంటిమేట్ సీన్స్ చూసేందుకు వారిని అనుమతించలేదు అనుకుందాం. అలాంటప్పుడు వారిలో నెగెటివ్ వేలో కురియాసిటీ పెరుగుతుంది. 'పేరెంట్స్ నన్నెందుకు ఆ సీన్స్ చూడనివ్వట్లేదు? అందులో ఏదైనా చెడు ఉందా?' లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ ఈ సీన్స్‌పై చర్చించకపోతే వారు తప్పుగా నేర్చుకునే ప్రమాదం ఉంది. నిజానికి ప్రస్తుత జనరేషన్‌లో పిల్లలను మానిటర్ చేయడం, వారు ఎలాంటి కంటెంట్‌కు ఎక్స్‌పోజ్ అవుతున్నారనే విషయాలను గుర్తించడం కష్టమైపోయింది. అందుకే ఒకవేళ ఇంటిమేట్ కంటెంట్ చూస్తున్నారనే అనుమానం కలిగితే.. తప్పకుండా పిల్లలకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ముద్దు అనేది ప్రేమను వ్యక్తపరిచే విధానమని, ఇందులో తప్పుగా ఆలోచించాల్సిన పనిలేదని వివరించాలి.
సమాధానం.. ఏది..?
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తెరపై సన్నిహిత దృశ్యాలను చూడటానికి అనుమతించరు. వెంటనే చానెల్‌ని మార్చడమో, పిల్లల కళ్లు మూయడమో చేస్తుంటారు. ఒకవేళ స్క్రీన్‌పై ఇంటిమేట్ సీన్స్ చూస్తూ దొరికిపోతే.. పిల్లల క్యారెక్టర్‌ను జడ్జ్ చేసేస్తారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. 'సన్నిహిత దృశ్యాలు నిజంగా సాంస్కృతికంగా అనైతికమా? పిల్లలకు సాన్నిహిత్యం గురించి తెలియకుండా ఉంచాలా? ఒకవేళ తల్లిదండ్రులు తాము ఉన్నప్పుడు అడ్డుకున్నా.. అన్ని వయసుల వారికి అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో పిల్లలు అలాంటి కంటెంట్‌కు గురికాకుండా ఉంటారా? ఇలాంటి దృశ్యాలను పేరెంట్స్ పర్యవేక్షణలో చూడకపోతే, పిల్లలు ఇంటిమసీ గురించి సరైన మార్గంలో అర్థం చేసుకునే అవకాశం ఉందా? పిల్లల దగ్గర జీవితంలో సాన్నిహిత్యం ప్రాముఖ్యత గురించి దాచడం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి?' అని తల్లిదండ్రులు ఓ సారి ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది.
నిస్సందేహంగా ఇంటిమసీ అనేది లైఫ్‌లో కీలకం అంటున్నారు నిపుణులు. ప్రతి సంబంధం కొన్ని రకాల సాన్నిహిత్యంపై ఆధారపడి ఉంటుంది. భాగస్వాములు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, పిల్లలు.. ఇలా ప్రతి సంబంధంలో కౌగిలింతలు, ముద్దులు సర్వసాధారణం. కానీ భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం విషయానికి వస్తే, దానిని పిల్లలకు వివరించడం కష్టం. దాని గురించి దాచాలనే భావన తరతరాలుగా ఉండటంతో బహిరంగంగా చర్చించకూడదనే ఒక రకమైన నిషిద్ధం ఏర్పడింది.
కానీ శృంగార సాన్నిహిత్యం దాగి ఉండేది కాదని మనం మరచిపోతాం. ఈరోజు లేదా రేపు.. ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట వ్యక్తి వైపు ఆకర్షితులవుతారు. కాబట్టి ఈ బంధం గురించి ముందుగానే సరైన మార్గంలో పిల్లలకు చెప్పడం మంచిది. అలాంటప్పుడు తప్పుగా ఆలోచించలేరు. పిల్లలకు సెక్స్ గురించి చెప్పకపోతే.. వారు దానిని మానుకోవాల్సిన చెడుగా అర్థం చేసుకుంటారు. నైతికంగా తప్పు అనే సంఘర్షణలో తమ జీవితాల్లో సగ భాగాన్ని గడిపేస్తారు. పర్యవసానంగా.. రహస్యంగా, ఏకాభిప్రాయం లేకుండా, తప్పుడు వ్యక్తితో సెక్స్‌లో పాల్గొనే పరిస్థితికి వచ్చేస్తారు. ఇది కాస్తా దారుణమైన పరిణామాలకు కారణం కావచ్చు.
అయితే ఇద్దరు పెద్దల మధ్య ప్రేమ లేదా అనుబంధంలో భాగమే కిస్ లేదా సెక్స్ అని పిల్లలకు బోధిస్తే.. నైతిక సంఘర్షణను ఎదుర్కోరు. సాన్నిహిత్యం అనేది సమ్మతిపై ఆధారపడిన భావోద్వేగాల ఆరోగ్యకరమైన వ్యక్తీకరణగా అర్థం చేసుకుంటారు. దీన్ని ఏకాభిప్రాయ బంధంగా చర్చించడం ద్వారా పిల్లలకు సురక్షితమైన స్పర్శ, గర్భనిరోధకం గురించి కూడా నేర్పించవచ్చు. అప్పుడే ప్రేమ అనేది.. మానవుల మధ్య బంధం యొక్క మాధ్యమమని తెలుసుకుంటారు.
Read More.....
- Tags
- lifestyle