Newborn Babies : నవజాత శిశువులకు పాత దుస్తులు ఎందుకు వేస్తారు.. కారణాలు ఏంటో తెలుసా..

by Sumithra |   ( Updated:2024-08-17 14:45:00.0  )
Newborn Babies : నవజాత శిశువులకు పాత దుస్తులు ఎందుకు వేస్తారు.. కారణాలు ఏంటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : ఇంట్లో నవజాత శిశువు పుట్టడంతో ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. దీనితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా భారతదేశంలో పిల్లలు పుట్టినప్పుడు పెద్దలు పిల్లల ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. నవజాత శిశువులకు ఎప్పుడూ కూడా కొత్త దుస్తులు వేయకుండా పాత దుస్తులను వేస్తారు. ఇంతకీ ఈ పాత బట్టలు ఎందుకు వేస్తారు, దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నవజాత శిశువు పుట్టిన తర్వాత పాత బట్టలు ధరింప చేయడం అనేది మన దేశంలో తరతరాలు వస్తున్న సంప్రదాయం. ఈ దుస్తులు వారికన్నా పెద్ద అన్నలు లేదా సోదరీమణులలో ఒకరివి అయి ఉంటాయి. నిజానికి పిల్లలకు పాత దుస్తులు వేయడం వెనుక నమ్మకం మాత్రమే కాదు, సైన్స్ కూడా దాగి ఉంది. ఇది పిల్లల ఆరోగ్యానికి సంబంధించినది.

పాత బట్టలు సౌకర్యవంతంగా ఉంటాయి..

ఒక గుడ్డను ఎక్కువసార్లు ధరించినప్పుడు తరచుగా ఉతకడం వల్ల వస్త్రం తేలికగా, మృదువుగా మారుతుంది. నవజాత శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల పాత బట్టలు ధరించడం వారికి సౌకర్యంగా ఉంటుంది. అయితే కొత్త బట్టలు చర్మం పై దద్దుర్లు, దురదలను కలిగిస్తాయి.

వైరల్ వ్యాధులు సోకుతాయన్న భయం లేదు..

పెద్దల నుంచి పిల్లల వరకు కొత్త బట్టలు ఉతకకుండానే వేసుకుంటారు. కానీ.. దాని వల్ల ఎంత నష్టమో తెలుసా. కొత్త బట్టల పై అనేక రకాల వైరస్ల ఉనికి ఉండవచ్చు. దీని కారణంగా శిశువు అనారోగ్యానికి గురవుతుంది. ఎందుకంటే నవజాత శిశువు రోగనిరోధక శక్తి అంత బలంగా ఉండదు. అంతే కాదు బట్టల పై ఉండే సూక్ష్మక్రిముల వల్ల కూడా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే కొన్ని పాత బట్టలు ఉతికి, బిడ్డ పుట్టకముందే బాగా ఆరబెడతారు.

బట్టలు ఎంచుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..

నవజాత శిశువులకు వాడే దుస్తుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మస్లిన్, కాటన్ వంటి మృదువైన బట్టలు ఎంచుకోవాలి. అంతే కాదు పిల్లలకు బిగుతుగా ఉండే దుస్తులు అస్సలు వేయకూడదు. పిల్లలకి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే తేలికగా, వదులుగా, సరైన సైజులో ఉండే బట్టలు వేయడం మంచిది.

పరిశుభ్రత పై శ్రద్ధ..

నవజాత శిశువుకు దుస్తులు ధరించడం నుండి ఒడిలో మోయడం వరకు, పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డిటర్జెంట్‌లో పిల్లల బట్టలు ఉతికిన తర్వాత, వాటిని శానిటైజ్ చేయాలి. దీని కోసం మార్కెట్లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా జలుబు, జ్వరం, దగ్గు వంటి ఏవైనా లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి బిడ్డను దూరంగా ఉంచాలి. ముఖ్యంగా నవజాత శిశువులను ఇతర చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి. నిజానికి, పిల్లలు ఆడుకునేటప్పుడు చాలా సూక్ష్మక్రిములు వారి చేతుల్లో ఉంటాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed