పురుషుల కంటే స్త్రీలకే చలి ఎక్కువ.. ఇందుకేనా!

by Sathputhe Rajesh |
పురుషుల కంటే స్త్రీలకే చలి ఎక్కువ.. ఇందుకేనా!
X

దిశ, ఫీచర్స్ : ఉష్ణోగ్రతలు తట్టుకునే విషయంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఇండోర్ ఉష్ణోగ్రతను ఇష్టపడతారని, ఎక్కువగా చలిని అనుభవిస్తారనే నమ్మకం కూడా విస్తృతంగా చెలామణిలో ఉంది. అయితే ఈ విషయాన్ని సమర్థించేందుకు ఏదైనా సైన్స్ ఉందా?

స్త్రీ పురుషుల మధ్య జీవసంబంధమైన తేడాలు :

సమాన శరీర బరువు కలిగి ఉన్నప్పటికీ వేడిని ఉత్పత్తి చేసేందుకు స్త్రీలు తక్కువ కండరాలను కలిగి ఉంటారు. వారి చర్మం, కండరాల మధ్య కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మం, రక్తనాళాలకు దూరం పెరిగి చల్లదనాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాదు పురుషుల కంటే తక్కువ జీవక్రియ రేటును కలిగి ఉండటం వల్ల అది చల్లటి వాతావరణానికి ఎక్స్‌పోజ్ అయినపుడు ఉష్ణ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో మహిళలు చలికి గురవుతారు.

హార్మోన్ల వ్యత్యాసాలు

మహిళల్లో అధిక పరిమాణంలో కనిపించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు.. శరీర కేంద్రకానికి, చర్మ ఉష్ణోగ్రతలకు దోహదం చేస్తాయి. ఈస్ట్రోజెన్ శరీర చివరి భాగాల వద్ద రక్త నాళాలను విస్తరిస్తుంది. అంటే చుట్టుపక్కల గాలికి ఎక్కువ వేడిని కోల్పోవచ్చు. ఇక ప్రొజెస్టెరాన్ చర్మంలోని నాళాలు కుంచించుకుపోయేలా చేయడం వల్ల అంతర్గత అవయవాలను వెచ్చగా ఉంచేందుకు వీలుగా మిగతా కొన్ని ప్రాంతాలకు తక్కువ రక్తం ప్రవహిస్తుంది. దీంతో మహిళలు చల్లటి వాతావరణాన్ని అనుభూతి చెందుతారు. ఈ హార్మోన్ బ్యాలెన్స్ ఋతు చక్రంతో పాటు నెల పొడవునా మారుతుంది. ఈ హార్మోన్లు.. స్త్రీల చేతులు, కాళ్లు, చెవులను పురుషుల కంటే మూడు డిగ్రీల సెల్సియస్ చల్లగా ఉండేలా చేస్తాయి. ఇక అండోత్సర్గము(Ovulation) తర్వాత వారంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి కనుక కోర్ బాడీ ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేకించి బయటి ఉష్ణోగ్రతల పట్ల మహిళలు సున్నితంగా ఉంటారు. 'చల్లని చేతులు, వెచ్చని హృదయం' అనే సామెతకు ఇదే మూలం కావచ్చు.

కేవలం మనుషులేనా?

మనుషులతో పాటు అనేక జాతుల పక్షులు, క్షీరదాలపై చేసిన అధ్యయనాలు ఈ వ్యత్యాసాలను గుర్తించాయి. మగవారు సాధారణంగా నీడ ఉన్న చల్లటి ప్రదేశాల్లో సమావేశమైతే మహిళలు ఎక్కువగా సూర్యరశ్మి ప్రసరించే వెచ్చని వాతావరణానికి మెగ్గు చూపుతారని తేలింది. మగ గబ్బిలాలు చల్లని, ఎత్తయిన పర్వత శిఖరాల వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఇష్టపడితే ఫిమేల్స్ వెచ్చని లోయల్లో ఉంటాయి.


Advertisement

Next Story

Most Viewed