సెక్స్ తర్వాత ఇంటిమేట్ ఏరియా క్లీనింగ్.. ఎందుకంత ముఖ్యం?

by srinivas |   ( Updated:2022-10-10 14:10:49.0  )
సెక్స్ తర్వాత ఇంటిమేట్ ఏరియా క్లీనింగ్.. ఎందుకంత ముఖ్యం?
X

దిశ, ఫీచర్స్ : హాట్‌ఫుల్ సెక్స్ సెషన్ తర్వాత పార్ట్‌నర్స్ హెల్త్, హైజీన్ అంశాన్ని మరచిపోతుంటారు లేదా నిర్లక్ష్యం చేస్తుంటారు. లేదంటే టీ-షర్టు లేదా టవల్‌తో ఇంటిమేట్ ఏరియాను తుడిచేసి సరిపెట్టుకుంటారు. కానీ ఇలా చేస్తే సరిపోదు. కచ్చితంగా జననాంగం, గజ్జలు వంటి సన్నిహిత ప్రాంతాలను పూర్తిగా కడగాలి. ఎందుకంటే యోని మాదిరి ఈ ప్రాంతాలకు సెల్ఫ్ క్లీనింగ్ సామర్థ్యం లేదు. అంతేకాదు పోస్ట్-సెక్స్ ఇంటిమేట్ క్లీనింగ్ ఎందుకంత కీలకమో వైద్య నిపుణులు కూడా వివరిస్తున్నారు.

ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

'ఓరల్ సెక్స్, టాయ్స్, ఫింగరింగ్ వల్ల సన్నిహిత ప్రాంతంలో బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. ఇది చికాకు, స్కిన్ ఇన్ఫెక్షన్ సహా జననేంద్రియాలపై మొటిమలకు దారితీస్తుంది. యోనిలోకి బ్యాక్టీరియా చేరితే బ్యాక్టీరియల్ వెజినోసిస్‌, యూటీఐ వంటి ఇన్‌ఫెక్షన్లు ఏర్పడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు సెక్స్ సమయంలో రాపిడి కారణంగా సూక్ష్మ గాయాలు ఏర్పడవచ్చు. బ్యాక్టీరియా వాటి ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తే అది టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (TSS) కారణంగా తక్షణ మరణానికి దారి తీస్తుంది. కాబట్టి సెక్స్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ శుభ్రపరుచుకుంటే సూక్ష్మక్రిములకు దూరంగా ఉండవచ్చు.

నేచురల్ ప్రాసెస్‌ నిర్వహణకు సాయం..

యోని వలె సున్నితమైన జననేంద్రియ చర్మం కూడా హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి సహజమైన ఎసిడిక్ మాంటిల్‌ను కలిగి ఉంటుంది. కానీ ఎక్కువ pH విలువను కలిగి ఉండే వీర్యం ప్రైవేట్‌ పార్ట్స్‌పై చిక్కుకునే అవకాశం ఉంది. ఇది ఇంటిమేట్ ఏరియా pHకి భంగం కలిగించడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అయితే శుభ్రంగా వాష్ చేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలోని సహజ pH చెక్కుచెదరకుండా ఉంటుంది.

ఎలా కడగాలి?

యోనిని శుభ్రపరిచేందుకు డౌచింగ్(ఏదైనా పరికరంతో వాటర్ స్ప్రే చేయడం) లేదా ఏదైనా చొప్పించడం మానుకోవాలి. కేవలం గోరువెచ్చని నీటితో, తేలికపాటి క్లెన్సర్‌తో జననాంగాలను శుభ్రం చేస్తే సరిపోతుంది. అంతేకాదు కఠినమైన సబ్బులు, డెటాల్, సువాసన కలిగిన ఉత్పత్తులను కూడా ఉపయోగించకూడదు.

ఇవి కూడా చదవండి : బాలికల్లో ముందే యుక్తవయసు.. పునరుత్పత్తి హార్మోన్లపై నీలి కాంతి ప్రభావం

Advertisement

Next Story