chocolate cravings: పీరియడ్స్‌కు ముందు మహిళల్లో చాక్లెట్ క్రేవింగ్స్.. ఎందుకంటే..?

by Prasanna |
chocolate cravings: పీరియడ్స్‌కు ముందు మహిళల్లో చాక్లెట్ క్రేవింగ్స్.. ఎందుకంటే..?
X

దిశ, ఫీచర్స్: పీరియడ్స్‌కు వారం రోజుల ముందే అమ్మాయిల్లో చాక్లెట్ క్రేవింగ్స్ అధికమవుతాయని చాలా అధ్యయనాలు తెలిపాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనేది ఇప్పటికీ సైంటిఫిక్‌గా రుజువు చేయలేకపోయారు. సాధారణంగా బుతుస్రావం కలిగిన స్త్రీలు కడుపు నొప్పి, బాడీ పెయిన్స్‌తో బాధపడుతుంటారు. ఆ ఇబ్బంది నుంచి తమ దృష్టిని మరల్చేందుకు షుగరీ ఐటెమ్స్ తినాలనుకుంటారనేది కొందరి వాదన.

కానీ నిపుణుల ప్రకారం రుతుచక్రంలో సంభవించే హార్మోన్ల అసమతుల్యత ఇందుకు కారణం. పీరియడ్స్ ప్రారంభంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోతున్నందునా ఆకలి అధికం అవుతుంది. లవ్ హార్మో్న్ 'సెరోటోనిన్' స్థాయిలు తగ్గుతాయి. అదే సమయంలో ఒత్తిడి హార్మోన్ 'కార్టిసాల్' స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్ పెరుగుదల, మంచి హార్మోన్ తగ్గుదల చక్కెర ఆహారాలను కోరుకునేలా చేస్తుంది. తద్వారా సెరోటోనిన్ లెవల్స్ పెరిగి ఉత్సాహంగా ఉంటారని చెప్తున్నారు. ఈ సిద్ధాంతం ద్వారా చాలా మందిని ఒప్పించినప్పటికీ... పీరియడ్ చాక్లెట్ క్రేవింగ్స్‌ను ప్రభావితం చేయడంలో హార్మోన్ అసమతుల్యత కీలక పాత్ర పోషిస్తుందని ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు.

అయితే తాజాగా పీరియడ్‌కు ముందు షుగరీ లేదా సాల్టీ క్రేవింగ్స్ ఇన్‌ఫ్లమేషన్ వల్ల కలగవచ్చని తాజా అధ్యయనం చెప్తోంది. ఋతుస్రావం ప్రారంభమయ్యే ఒక వారం లేదా రెండు వారాల ముందు వారి రక్తంలో ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువగా ఉన్న స్త్రీలు.. చాక్లెట్ వంటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed