- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heart attacks: హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా ఆ ప్లేస్‌లోనే ఎందుకు వస్తున్నాయి? కారణమిదే!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది గుండెపోట్ల బారిన పడుతున్నారు. ఇందుకు కారణం జీవన శైలిలో మార్పులే కారణమని చెప్పుకోవచ్చు. ఆహారపు అలవాట్లలో కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతున్నాయి.అప్పట్లో 50, 60 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా సడెన్ హార్ట్ ఎటాక్ తో ఎంతో మంది మరణిస్తున్నారు. పాతికేళ్ల యువత కూడా గుండెపోటు బారిన పడి.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచే పరిస్థితులు నెలకొన్నాయి.
బాత్రూంలో ఎందుకు గుండెపోటు వస్తుంది..?
ఇకపోతే ఎక్కువ మందికి బాత్రూంలో హార్ట్ ఎటాక్ వస్తుంది. చాలామంది గుండెపోటుతో బాత్రూంలోనే కుప్పకూలిపోతుంటారు. అయితే అమెరికా ఏజెన్సీ ఎన్‌సీబీఐ లెక్కల ప్రకారం చూసినట్లైతే.. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మంది బాత్రూంలో గుండెపోటుతో చనిపోతున్నారు. కాగా ఎక్కువగా బాత్రూంలోనే ఎందుకు అలా మరణిస్తున్నారని తాజాగా తెలిపారు. అయితే స్నానం చేసేటప్పుడు ఎక్కువ మంది ముందు తలపై వాటర్ పోస్తారు. దీంతో వేడి రక్తం గల బాడీ చల్లటి ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయలేకపోతుందట. కాగా అన్ని వైపుల నుంచి తలపై బ్లడ్ సర్కులేషన్ పెరుగడంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి.
ఈ సమస్య వారిలో కూడా..
ఈ కారణంగా ఎక్కువగా బాత్రూంలోనే గుండెపోటుతో మరణిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మలబద్ధకంతో బాధపడుతోన్న వారు కూడా బాత్రూంలోనే ఎక్కువగా హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్ తో మరణిస్తున్నారని.. వీరు వాష్రూమ్‌కు వెళ్లినప్పుడు ముక్కుతుంటారని, దీంతో రక్తనాళాల్లోని బ్లడ్ స్పీడ్ గా గుండె వైపుకు ఎగిసి పడుతుందని అంటున్నారు. దీంతో హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారని చెబుతున్నారు. కాగా మలబద్ధకంతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.