చపాతీలు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి..?

by Dishaweb |   ( Updated:2023-06-02 12:53:49.0  )
చపాతీలు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి..?
X

దిశ, వెబ్‌డెస్క్ : కొలమానానికి అతీతమైనది గుండ్రకారం. గుండ్రకారం ఆకర్షణీయమైన ఆకారం. సూర్యుడు, చంద్రుడు, భూమి కూడా గుండ్రంగానే ఉంటాయి. వీటిని చూసే కళ్లు కూడా గుండ్రంగానే ఉంటాయి. అలాగే చపాతీ వృత్తాకారంలో ఉంటుంది. అయితే మనం ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం తయారు చేసుకునే చపాతీ ఎందుకు గుండ్రంగా చేస్తున్నారు..? అసలు అది రౌండ్‌గా ఉండటానికి ప్రధాన కారణం, ప్రపంచాలన్నీ ఎలా చుట్టేసిందే చూద్దాం.

భారత ఉపఖండం నుండి వలస వచ్చిన వ్యాపారుల వల్ల మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికా కరేబియన్ దీవులకు పరిచయమైన ఈ చపాతీలు క్రమంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా చుట్టేసింది. 'చపాతీ' అనే పదం హిందీ పదం. 'చపాత్' నుండి వచ్చింది. దీని అర్థం 'గది'. భారతదేశంలోని ప్రజలు ధాన్యాన్ని ఉపయోగించి తయారు చేయడం నేర్చుకున్న మొదటి వంటలలో చపాతీ ఒకటి. కొన్నిప్రాంతలలో ఇది ప్రధానమైన ఆహారం. చపాతీలు ప్రధానంగా గోధుమ పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ రోజుల్లో వివిధ ప్రాంతాల్లో జొవరిసి, బజ్రా, రాజగిర, రాగి, మాకి, బేసన్ వంటి వివిధ ధాన్యాలు, గోధుమ పిండి, శుద్ధి చేసిన పిండి మిశ్రమాన్ని ఉపయోగించి చపాతీలు తయారు చేస్తారు. మొఘల్ యుగంలో, చపాతీలు 'తందూరి వంట' అని పిలువబడే ప్రత్యేకమైన వంట పద్ధతితో రూపాంతరం చెందాయి.

చపాతీ నిజానికి గుండ్రగా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆకారంలో ఉండొచ్చు... గోళాకరపు పిండిని చేతితో చుట్టినప్పుడు గుండ్రని ఆకారం సహజంగా వస్తుంది. పిండిని వృత్తాకారంలో చుట్టడానికి ఇది సులభమైన ఆకారం. రోలింగ్ పిన్ పనిని సులభతరం చేయడంతోపాటు సమానంగా చుట్టిన అంచులతో వృత్తాకార ఆకారాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. ఈ వృత్తాకార ఆకారం కూడా వంట విషయానికి వస్తే ప్రయోజనం ఉంటుంది. చపాతీ, దోసె వంటివి వృత్తాకారంలో ఉన్నందున,ఇవి అన్ని వైపులా సమానంగా కాలుతాయి.

చపాతీ వృత్తాకారంలో ఉండటానికి శాస్త్రీయ కారణాలు:

మెదడుకు, ముఖ్యంగా మన కళ్లకు, పదునైన అంచుల కంటే సర్కిళ్లను గుర్తించడం చాలా సులభం. దీని అర్థం గుండ్రని వస్తువులు చూడటం సులభం ఉపయోగించడం సులభం అని. చిత్రాలను ప్రాసెస్ చేసే కంటిలోని భాగమైన ఫోవియా, సర్కిల్‌లను సెన్సింగ్ చేయడంలో వేగంగా ఉంటుంది. ఎందుకంటే పదునైన అంచులు వస్తువులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వస్తువు గుండ్రంగా ఉంటే, అది తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందువల్ల, అవి గమనించడానికి కంటికి హాని కలిగించవు.

Also Read..

Eggs: గుడ్లు ఆరోగ్యానికి మంచివి కావా?

Advertisement

Next Story