సినీ సెలబ్రిటీలపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి తక్కువ తెలివి ఉంటుందా?

by sudharani |   ( Updated:2023-10-25 08:04:45.0  )
సినీ సెలబ్రిటీలపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి తక్కువ తెలివి ఉంటుందా?
X

దిశ, ఫీచర్స్: సినీ సెలబ్రిటీలు, రిచెస్ట్ పర్సన్స్ జీవితాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవారిలో తక్కువ తెలివితేటలు ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రముఖుల వార్తలు, గాసిప్స్‌పై తక్కువ ఆసక్తి ఉన్నవారితో పోలిస్తే అభిజ్ఞా సామర్థ్య పరీక్షల్లో పేలవమైన ప్రతిభ కనబరిచారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. BMC సైకాలజీలో ప్రచురించబడిన 2021 అధ్యయనం ప్రకారం.. 1763 మందిపై చేసిన ప్రయోగంలో కాగ్నిటివ్ స్కిల్స్ పరీక్షించేందుకు ఆన్ లైన్ టెస్ట్ నిర్వహించగా.. ఈ ఫలితాలు వెలువడ్డాయి. అయితే తక్కువ తెలివితేటలు ప్రముఖుల వ్యామోహానికి కారణమా లేదా పర్యవసానమా అనేది అస్పష్టంగానే ఉంది. సెలబ్రిటీల పట్ల అటెన్షన్ చూపిస్తున్న వ్యక్తులు అభిజ్ఞా పరీక్షల్లో పేలవంగా రాణిస్తున్నారా? లేదా సంక్లిష్టమైన సబ్జెక్టులపై ఆసక్తిని కొనసాగించలేకపోవడం వారి అబ్సెషన్ కు కారణమా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed