Kalki 2898 AD : ప్రభాస్ కల్కి వల్ల నష్టపోయిన హీరోయిన్.. ఆమె ఎవరంటే..?

by Prasanna |
Kalki 2898 AD : ప్రభాస్ కల్కి వల్ల నష్టపోయిన హీరోయిన్.. ఆమె ఎవరంటే..?
X

దిశ, సినిమా : ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే భారీ విజయాన్ని అందుకుంది. దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంకా ఈ మూవీలో దిశా పటాని, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం మృణాల్ ఠాకూర్ వంటి నటీనటులు అతిధి పాత్రల్లో కనిపించారు.

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తెలుగులో వరుణ్ తేజ్ లోఫర్ మూవీతో పరిచయమైంది. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈ హాట్ బ్యూటీ కల్కి 2898 AD చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంతో తెలుగులో అవకాశాలు వస్తాయనుకుంది.

కానీ, ఈ మూవీలో ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదు. ఈమె నటించిన సీన్లు కట్ చేస్తే సినిమా బావుండేదని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా, దిశా పటానికి ఈ సినిమా వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. ఇది పాన్ ఇండియా మూవీ అయినా.. దిశా కెరీర్ కు ప్లస్ కాలేదు.. ఇక, ఈ ముద్దుగుమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

Next Story