శృంగార కోరికలు ఎవరికి ఎక్కువ.. రోజుకు ఎన్ని సార్లు రతిలో పాల్గొనవచ్చు ?

by Sumithra |
శృంగార కోరికలు ఎవరికి ఎక్కువ.. రోజుకు ఎన్ని సార్లు రతిలో పాల్గొనవచ్చు ?
X

దిశ, ఫీచర్స్ : నవరసాలలో ఒక రసం శృంగారం. శృంగారంతో మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట.. మెదడులో ఉండే హిప్పో క్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. సెక్స్ వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలై సంతోషంగా ఉంటారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వారు గుర్తించారు. రతిలో పాల్గొంటే దంపతులు ఎంతో తృప్తి చెందుతారు.

చాలా మంది యువతీయువకుల్లో ఓ వయసు రాగానే శృంగార కోరికలు పుడతాయి. వారికి కలిగిన ప్రేమను వ్యక్తపరిచే శారీరక చర్యే శృంగారం. తన భాగస్వామి పై ఎంత ప్రేమ ఉందో శృంగారం ద్వారా వ్యక్తపరచవచ్చు. అయితే ఎక్కువగా పురుషులు మాత్రమే తమ ఫీలింగ్ ని బయటపెడతారని కొన్ని అధ్యయణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే లైంగిక వాంఛ మహిళల్లో ఎక్కువా లేదా పురుషుల్లో ఎక్కువ అనే విషయంలో చాలా వరకు సందిగ్ధంలో ఉంటారు. మరి ఎవరికి ఎక్కువ కామకోరికలు వస్తాయో తెలుసుకుందాం..

లైంగిక వాంఛ ఒకరికి ఎక్కువగా, మరొకరికి తక్కువగా ఉంటుందని ఏమీ లేదు. భౌతిక రూపాల్లో తేడా ఉంటుంది కానీ శృంగారం విషయంలో ఇద్దరూ సమానమేనట. రతి కోరికలు మహిళల్లో, పురుషుల్లో సరిసమానంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ విషయంలో పురుషులు బయటపడి, స్త్రీలు లోలోపల దాచుకుంటారట. సమాజంలోని పరిస్థితులను బట్టి స్త్రీలు వారి కోరికలను బయట పెట్టరు. భార్యాభర్తలు ఒకరికి కోరిక కలిగినప్పుడు మరొకరు సపోర్ట్ చేసుకోవాలని నిపుణుల అభిప్రాయం. దంపతులు వారి భావాలను మనస్పూర్తిగా వ్యక్తపరుచుకోవాలని చెబుతారు.

భార్యాభర్తల సామర్థ్యం మేరకు రోజులో మూడు, నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒక్కసారి మాత్రమే చేయాలని లిమిట్ ఏమీ లేదట. ఓపిక ఉంటే ఎన్నిసార్లు అయినా సెక్స్ లో పాల్గొనవచ్చు. ఎక్కువ రోజులు శృంగారంలో పాల్గొనకుండా ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అందుకే వారానికి నాలుగైదు సార్లు అయినా సెక్స్ లో పాల్గొంటే మంచిదట.

Advertisement

Next Story

Most Viewed