- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతదేశంలో టూరిస్ట్ జైళ్లు.. ఇక్కడ పర్యాటకులకు మాత్రమే ప్రవేశం..
దిశ, ఫీచర్స్ : నేరం చేసినప్పుడు జైలుకు వెళ్లడం సహజం. కానీ కొంతమంది పర్యటించేందుకు జైలుకు వెళుతూ ఉంటారు. అయితే అలా పర్యటించేందుకు ఏ పెద్ద అధికారి కానవసరం లేదు. అతి సామాన్యులు కూడా ఈ జైళ్లను సందర్శించవచ్చు. వింటుంటే వింతగా ఉంది కదా. కానీ అది నిజం భారతదేశంలో కొన్ని జైళ్లు కేవలం పర్యాటకుల కోసం మాత్రమే ఉన్నాయి. ఎలాంటి నేరం చేయకుండా ఈ జైలుకు వెళ్ళవచ్చు. ఒక రోజు ఖైదీలా కూడా జీవితాన్ని గడపవచ్చు. భారతదేశంలో ఉన్న ఈ ప్రదేశాలు వాటి చరిత్ర, ఆసక్తికరమైన కథలతో ప్రసిద్ధి చెందాయి. ఈ జైళ్లను సందర్శించినప్పుడు స్వాతంత్ర్య పోరాటం చేసిన కాలం నాటి ఎన్నో కథలను తెలుసుకోవచ్చు. అలాగే బ్రిటిష్ వారి నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో ఏ వ్యక్తులు పోరాడారో కూడా తెలుసుకోవచ్చు. భారతదేశ ఆసక్తికరమైన చరిత్రతో ముడిపడి ఉన్న జైళ్లు ఎక్కడ ఉన్నాయో, వాటి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్..
ఈ జైలు భారతదేశపు ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న కాలాపానీ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వాతంత్ర్య సమరయోధులు బతుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్ ధైర్యసాహసాలు గురించి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ జైలును పర్యాటకులు సందర్శించేందుకు తెరుస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం పర్యాటకుల కోసం లేజర్ షోలు, మ్యూజిక్ షోలు నిర్వహిస్తారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ జైలును సందర్శించడానికి రావచ్చు.
2.ఎరవాడ జైలు, పూణే (మహారాష్ట్ర)
ఎరవాడ దక్షిణ ఆసియాలో అతిపెద్ద జైలు. భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్‌లతో సహా చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ జీవితంలోని పోరాట క్షణాలను గడిపిన 1831లో బ్రిటిష్ పాలకులు దీనిని నిర్మించారు. ఈ జైలులో గాంధీ, తిలక్ పేరుతో ఉరితీసే ఒక గది కూడా ఉంది.
3.తీహార్ జైలు, ఢిల్లీ..
భారతదేశంలోనే అతిపెద్ద జైలు తీహార్ అని చెబుతారు. ఈ జైలులో నివసిస్తున్న ఖైదీలు కూడా తీహార్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కుట్టుపని, అల్లిక, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌తో సహా అనేక రకాల పనులు చేస్తున్న ఖైదీలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఖైదీలను బిజీగా ఉంచడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి అనేక పనులు చేయిస్తారు.
4. సంగారెడ్డి జైలు, హైదరాబాద్..
హైదరాబాద్‌లో 220 ఏళ్ల నాటి ఈ జైలు ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఈ జైలును 1976లో నిర్మించారు. ఇప్పుడు ఇది పర్యాటకుల వినోదం కోసం మ్యూజియంగా ఉంది. ఇక్కడ మీరు 'ఫీల్ ది జైల్' పథకం కింద జైలును సందర్శించి ఆనందించవచ్చు. ఈ పథకం కింద 24 గంటలు జైలులో గడపవచ్చు.
5. వైపర్ ఐలాండ్, అండమాన్..
ఇది సెల్యులార్ జైలులాగా ప్రాచుర్యం పొందలేదు. అయితే ఇది భారతదేశ ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలను కలిగి ఉంది. ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచడానికి ప్రయత్నించిన వారిని శిక్ష కోసం ఇక్కడకు పంపేవారు.
Read More..
వేడెక్కుతున్న భూ వాతావరణం.. వారానికి రెండు టన్నుల మంచుతో చల్లబరిచేందుకు నాసా చేస్తున్న ప్లాన్ ఇదే..