- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raksha Bandhan: మీ సోదరి కట్టిన రాఖీ ఎప్పుడు పడితే అప్పుడు తీసేయకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
దిశ, ఫీచర్స్: రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ వేడుక సోదరీమణుల మధ్య ప్రేమను ఈ వేడుక సూచిస్తుంది. ఈ పండుగను శ్రావణ మాసం నాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది వచ్చే రక్షబంధన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సారి ఆగస్టు 19న సోమవారం వచ్చింది. అది శ్రావణ సోమవారం కావడంతో ప్రత్యేక విశిష్టతను పొందింది. నిజానికి ఈ పండుగ ఒకటే రోజు సెలబ్రేట్ చేసుకోరు జన్మాష్టమి వరకు చేసుకోవచ్చు. అన్నదమ్ములకు దూరంగా ఉండేవారు రాఖిని జన్మాష్టమి నాడు కూడా కట్టవచ్చును. అయితే రక్షబంధన్ వివిధ సంప్రదాయాల ప్రకారం చేసుకుంటారు.
కొందరు తిలకం పెట్టి కొబ్బరికాయను ఇచ్చి తర్వాత రాఖీ కడతారు. ఆ తర్వాత స్వీట్ పెట్టి సోదరులు సంతోషంగా ఉండాలని హారతి ఇస్తారు. దీంతో సోదరుడు సోదరి పాదాలను తాకి ఆశ్వీర్వాదం తీసుకున్న తర్వాత బహుమతి ఇస్తారు. అయితే కొంతమంది మాత్రం కొబ్బరికాయను ఇవ్వరు. బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ పెడతారు. రక్షాబంధన్ నాడు రాఖీ కట్టిన తర్వాత చాలామంది వెంటనే తొలగించేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అయితే అలా చేయకూడదని హిందూ పండితులు చెబుతున్నారు. రాఖీని జన్మాష్టమి నాడు తొలగించి ఎక్కడైనా చెట్టుకు కట్టడం లేదా ప్రవహించే నదిలో వేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ చేతికి ఉండగానే తెగిపోతే దానిని ఎరుపు రంగు క్లాత్‌లో కట్టి పూజ గదిలో పెట్టడం లేదా నీటిలో పడేయడం చేయాలని అంటున్నారు.