నలుగురూ చేసిందే మనమూ చేస్తాం.. నవ్వితే నవ్వుతాం.. ఏడిస్తే ఏడుస్తాం!

by Javid Pasha |
నలుగురూ చేసిందే మనమూ చేస్తాం.. నవ్వితే నవ్వుతాం.. ఏడిస్తే ఏడుస్తాం!
X

దిశ, ఫీచర్స్ :మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా?.. కొంతమంది ఒక దగ్గర గుమిగూడి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జోకులు వేసుకొని గట్టిగా నవ్వుతుంటారు.సడెన్‌గా మనం అక్కడికి వెళ్లామనుకోండి. ఏం జరుగుతుంది? వాళ్లతోపాటు మనం కూడా నవ్వేస్తాం. బాధాకరమైన సందర్భాల్లోనూ అదే జరుగుతుంది. నలుగురూ ఏడుస్తుంటే మనం కూడా ఏడ్చేస్తాం. దీనినే భావోద్వేగ అంటు వ్యాధిగా(Emotional contagion) పిలుస్తారు మానసిక నిపుణులు. సాధారణంగా అతి భావోద్వేగాలుగానూ పేర్కొంటారు.

అనాలోచితన ప్రవర్తన

కొన్ని సందర్భాల్లో మనం అనాలోచితంగా ప్రవర్తిస్తుంటాం. ఎదుటి వారి భావోద్వేగాలను అనుగుణంగా మనం కూడా భావోద్వేగానికి లోనవుతుంటాం. ఈ అనుకోని అనుకరణను అంటు వ్యాధిగా పేర్కొంటున్నప్పటికీ, వాస్తవానికి ప్రమాదకరమైంది మాత్రం కాదంటున్నారు నిపుణులు. నిజానికి ఎమోషనల్ కాంటేజియన్ అన్‌కాన్సియస్ ప్రాసెస్‌ను సూచిస్తుందని చెప్తున్నారు.

ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి

ఎమోషనల్ సిచ్యువేషన్స్‌‌ అనేవి సమూహంలో వ్యక్తం అయినప్పుడు ఇవి ఒక పర్సన్ నుంచి అదర్ పర్సన్‌కు వ్యాప్తిస్తాయి. అంటే కోపం, బాధ, సంతోషం, విచారం, ఆందోళన, దుక్కం వంటి పరిస్థితుల్లో ఇతరుల భావోద్వేగాలను వెంటనే ‘క్యాచింగ్’ చేసేస్తుంటాం. ఇక్కడ మానసికంగా ఆవేశపడిన వ్యక్తి లేదా వ్యక్తుల సమక్షంలో ఉండటంవల్ల మరో వ్యక్తి కూడా అదే అనుభూతి చెందుతాడు. కొన్నిసార్లు పూర్తిగా తనను తాను పట్టించుకోని పరిస్థితి కూడా ఎదుర్కోవచ్చు.

ఎందుకలా జరుగుతుంది?

భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు వాస్తవానికి మెదడులోని ‘మిర్రర్ న్యూరాన్స్’ ప్రేరణ పొందుతాయని అధ్యయనాలు పేర్కొ్ంటున్నాయి. దీనివల్ల సదరు వ్యక్తులు భావోద్వేగాలను ప్రదర్శించడం లేదా ఇతరులు ప్రదర్శిస్తున్నప్పుడు దాని ప్రభావానికి లోనవడం జరిగిపోతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిలో భయంకరమైన ముఖ కవళికలను గమనించగానే ఎదుటి వ్యక్తిలోని మిర్రర్ న్యూరాన్స్ రెస్పాండ్ అవుతాయి. అతను కూడా అదే భయానక అనుభూతి పొందుతాడు. ఇలా ఫేసియల్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజెస్, వ్యక్తుల స్వరం మారడం, భావోద్వేగ అంటువ్యాధికి దోహదం చేస్తాయి.

సామాజిక ప్రభావం

కొన్నిసార్లు సామాజిక నిబంధనలు, కట్టుబాట్లు, వేధింపులు వంటివి కూడా ఎమోషనల్ కాంటేజియన్‌ను ప్రభావితం చేస్తాయి. పరధ్యానం లేదా తదాత్మ్యం కలిగి ఉండటం, ఇతరుల భావాలను డీప్‌గా అర్థం చేసుకోవడం, షేర్ చేసుకోవడం వంటివి భావోద్వేగ అంటువ్యాధిలో కీ రోల్ పోషిస్తాయని జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ అధ్యయనం పేర్కొంటున్నది.

భావోద్వేగాలు - రకాలు

ప్రధానంగా మూడు రకాల భావోద్వేగ అంటువ్యాధులు ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో మొదటిది పాజిటివ్ ఎమోషనల్ కాంటేజియన్.. ఇది ఒక వ్యక్తి మరో వ్యక్తికి వ్యాపించినప్పుడు ఏర్పడే భావోద్వేగం. ఉదాహరణకు.. ఉత్సాహంగా ఉన్న వ్యక్తి చుట్టూ ఉండటంవల్ల మనం కూడా ఉత్సాహంగా ఉంటాం. ఇక రెండవది నెగెటివ్ ఎమోషనల్ కాంటేజియన్.. ఇది వ్యక్తుల మధ్య ప్రతికూల భావోద్వేగాల వ్యాప్తిని కలిగి ఉంటుంది. ఎదుటి వ్యక్తులు కోపంగా లేదా ఆత్రుత, ఆవేశం వంటివి వ్యక్త పరుస్తున్నప్పుడు మనం కూడా వాటిని స్వీకరించడం, అనుభవించడం, ప్రదర్శించడం చేస్తుంటాం. మూడవది మిమెటిక్ ఎమోషనల్ కాంటేజియన్.. ఇతరులు ఒక నిర్దిష్ట భావోద్వేగాన్ని ప్రదర్శించడాన్ని గమనించినప్పుడు, మనకు తెలియకుండానే అనుసరిస్తూ అదే విధమైన భావోద్వేగ స్థితిని ఫీలవుతుంటాం.

పరిష్కారం ఏమిటి?

భావోద్వేగాలు కాస్త తీవ్రమైన రూపంలో వ్యక్తం అవుతుంటాయి కాబట్టి.. భావోద్వేగ అంటు వ్యాధులుగా పేర్కొంటారు. అంతేకానీ ఇవి ప్రమాదకరం కాదు. నిజానికి మానవుల్లో ఉండే సహజమైన లక్షణాలే. కాకపోతే కొన్ని సందర్భాల్లో అతిగాప్రదర్శితం అయితే అన్‌కాన్సియస్ పరిస్థితికి దారితీస్తుంటాయి. మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఎమోషనల్ కాంటేజియస్ నుంచి స్థిరత్వం సాధించవచ్చు. యోగా, మెడిటేషన్, సామాజిక స్పృహ, హెల్తీ ఎమోషన్స్‌ను సెట్ చేసుకోవడం వంటివి అతి భావోద్వేగ బలహీనతల నుంచి బయటపడేస్తాయి. అవసరం అయితే మానసిక నిపుణులను సంప్రదించి కౌన్సెలింగ్ లేదా ట్రీట్మెంట్ పొందవచ్చు.

Advertisement

Next Story

Most Viewed