షుగర్ పేషెంట్స్ ఉపవాస సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

by Sumithra |
షుగర్ పేషెంట్స్ ఉపవాస సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది వారానికి రెండు, మూడు రోజులు ఉపవాసం ఉంటూ ఉంటారు. కొంత మంది మాత్రం ఒక్క రోజును కూడా వదలకుండా ప్రతి రోజూ ఆహారాన్ని తింటుంటారు. ఈ రెండు పద్దతులు కూడా కాస్త ప్రమాదకరమనే చెప్పుకోవాలి. అతిగా ఉపవాసం ఉండడం, అతిగా తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసివస్తుంది. కానీ అప్పుడప్పుడు మాత్రం ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వలన జీర్ణ వ్యవస్థకు కాస్త ఖాళీ దొరుకుతుంది. అయితే ఈ ఉపవాసాన్ని ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే పాటిస్తే మంచిది. షుగర్ ఉన్నవారు చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇక తప్పని పరిస్థితుల్లో కొంత మంది డయాబెటిక్ పేషెంట్లు ఉపవాసం ఉండక తప్పదు. అలాంటప్పుడు వారు షుగర్ లెవల్స్ పెరగకుండా, తగ్గకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఆ జాగ్రత్తలు ఏంటి, ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఉపవాస సమయంలో తీసుకునే జాగ్రత్తలు..

వైద్యులు చెప్పిన సూచనల మేరకు షుగర్ ఉన్నవారు ఉపవాసం ఉండడం కొంచం కష్టంతో కూడుకున్నపని. వారు ఫాస్టింగ్ లో ఉంటే రక్తంలో షుగర్ లెవల్స్ స్థాయిలో హెచ్చుతగ్గులయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సాహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఉపవాసం ఉన్న సమయంలో ప్రోటీన్ రిచ్‌గా ఉండే గుమ్మడి కట్‌లెట్స్, నట్స్ లాంటివి తింటే కడుపు నిండుగా ఉంటుంది. అలాగే కివి, నారింజ పండ్లను తింటే విటమిన్ సి, ఫైబర్ శరీరానికి అందుతాయి. ఈ పండ్లను తీసుకోవడం వలన శరీరంలో ఇన్సులిన్ ను బ్యాలెన్స్ చేయడంలో సాయపడతాయి. కాటేజ్ చీజ్ క్యూబ్స్‌, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తో చేసిన పాన్‌కేక్‌ని కూడా ఈ సమయంలో తినొచ్చని నిపుణుల సూచన.

ఫుడ్ తో పాటు నీరు అధికశాతంలో తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉపవాస సమయంలో డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి 2 నుంచి 3 లీటర్ల నీరు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నార్మల్ వాటర్ మాత్రమే కాకుండా మధ్య మధ్యలో పుదీనా నీరు, కొబ్బరి నీరు, నిమ్మరసం, గ్రీన్ టీ, ఉప్పు లేని మజ్జిగ, వంటి తక్కువ కేలరీస్ గల పానీయాలు తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్యని దూరం చేస్తాయి.

షుగర్ ఉన్నవారు ఉపవాస సమయంలో చేయాల్సిన అతిముఖ్యమైన పని ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. శరీరానికి, మెదడుకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం అప్పుడప్పుడూ కాస్త వ్యాయామం, అటు ఇటు నడవడం లాంటివి చేస్తూ ఉండాలి.

Advertisement

Next Story