Healthtip:నిద్రలేమితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..

by Hajipasha |   ( Updated:2022-12-25 12:49:23.0  )
Healthtip:నిద్రలేమితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..
X

దిశ, ఫీచర్స్: మీరు రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా నిద్ర పట్టాలంటే.. ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఈ మధ్య చాలా మందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. ఒక్కరోజు రాత్రిపూట నిద్ర లేకపోతే ఆ ప్రభావం మరుసటి రోజు చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఎక్కువ కాలం నిద్రతో లేమితో బాధపడేవారిలో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఎప్పుడో ఒకసారి అయితే ఏమో కానీ తరచూ నిద్రపట్టడం లేదంటే.. మీరు స్లీపింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టే లెక్క. ఇలాంటి సమస్య ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. లేకుంటే సమస్యలకు స్వాగతం పలికినట్టే.

హెల్తీ వెదర్ క్రియేట్ చేసుకోండి

ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే.. అందుకు తగిన వాతావరణం కూడా ఉండాలి. గదిలోని వాతావరణం, వెలుతురు, శబ్దాలు, వస్తువులు మీ నిద్రకు భంగం కలిగించకుండా ఉండాలి. పరుపు, దుప్పటి, తలగడను కూడా అనువైన విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం వల్ల రాత్రిపూట నిద్ర రాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం పూట నిద్రకు స్వస్తి పలకండి.

టైమ్ పాటిస్తే మంచిది

నిద్రలేమి సమస్య నుంచి బయట పడేందుకు నిద్రపోయే, నిద్రలేచే సమయాన్ని పాటించాలంటున్నారు వైద్య నిపుణులు. డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్స్ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ ఒకే టైమ్‌కు నిద్రపోవడం, ఒకే టైమ్ నిద్రలేవడం అలవాటు చేసుకుంటే మంచిదట.

వీటిని దూరం పెట్టండి

కాఫీ, టీ ఎక్కువ సార్లు తాగడం కూడా నిద్రలేమికి దారితీస్తాయి. అందుకే వాటిని దూరం పెట్టాలి. నిద్రకు ఉపక్రమించేకంటే మూడు లేదా నాలుగు గంటల వీటిని తీసుకోకూడదు.

వ్యాయామం చేయాలి

ఓ అధ్యయనం ప్రకారం.. నిద్రలేమితో బాధపడే వారు వ్యాయామం చేయడం ద్వారా సమస్యను అధిగమించినట్లు తేలింది. రాత్రి పడుకునే ముందు వ్యాయామం చేయడం కన్నా, పగటిపూట బయట తిరుగుతూ వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం. వ్యాయామం ద్వారా ఎపినెఫ్రిన్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలై శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి.

Read more:

కామంలో కూడా కల్తీ ఉంటుందా..?

Advertisement

Next Story