Obsessive Love Disorder : అబ్సెసివ్ లవ్ డిజార్డర్ అంటే ఏమిటి.. ఈ సంకేతాలు ఎలా ఉంటాయో చూసేద్దామా..

by Sumithra |
Obsessive Love Disorder : అబ్సెసివ్ లవ్ డిజార్డర్ అంటే ఏమిటి.. ఈ సంకేతాలు ఎలా ఉంటాయో చూసేద్దామా..
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పటి కాలంలో పెళ్లి సంబంధం వచ్చిందంటే చాలు అమ్మాయి, అబ్బాయి గుణగణాలను చూసి సంబంధం కుదుర్చుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. భాగస్వామి ఎంత సంపాదిస్తాడు, అతని భవిష్యత్తు ఎలా ఉంది, అతని స్వభావం ఏమిటి, కుటుంబంలో ఎవరు ఉన్నారు. అతనికి ఎంత ఆస్తి ఉంది. ఈ ప్రశ్నలన్నింటికీ పెళ్లికి ముందే సమాధానాలు అడగడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. అయితే ఇప్పటి కాలంలో కూడా కొంతమంది దీనికి విరుద్ధంగా, జీవితంలో లేదా సంబంధంలో ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కొందరు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ప్రేమ కూడా సంబంధంలో చాలా సమస్యలకు కారణం అవుతుంది. రిలేషన్ షిప్స్ లో కొంత మంది మితిమీరిన ప్రేమకు బానిసలవుతారు. అది వారిని విలన్లుగా కూడా మారుస్తుంది.

ప్రేమలో ఉన్నప్పుడు, వివాహం జరిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు కొన్నిసార్లు తన భాగస్వామితో వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. తన భాగస్వామిని అమితంగా ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఇలా ప్రేమలో ఉన్నప్పుడు తన భాగస్వామి ఎవరినైనా కలవడానికి కూడా అస్సలు ఇష్టపడరు, అనుమతించరు.

ఈ రకమైన స్వభావాన్ని అబ్సెసివ్ లవ్ డిజార్డర్ అంటారు. దీని కారణంగా తమ భాగస్వామిని ఎల్లవేళలా గమనించడం, వారిని అనుమానించడం లేదా వారి దగ్గరే ఉండడం వంటివి మీ భాగస్వామి అబ్సెసివ్ లవ్ డిజార్డర్‌లో ఉన్నాయనడానికి అనేక సంకేతాలు. ఇంకా దీని లక్షణాలు ఏమిటి, దానిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అబ్సెసివ్ లవ్ డిజార్డర్ అంటే ఏమిటి ?

తన భాగస్వామి పై అతిగా ప్రేమ పెరిగి మానసిక అనారోగ్యంగా మారినప్పుడు దానిని అబ్సెసివ్ లవ్ డిజార్డర్ (OLD) అని అంటారు. ఒక సంబంధంలో, ఒక వ్యక్తి తన భాగస్వామిని ఇతరులను కలవడానికి అనుమతించనప్పుడు, వారిని అనుమానించినప్పుడు వారికి OLDతో ఇబ్బంది పడుతున్నారని అర్థం అంటున్నారు నిపుణులు.

అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి తన భాగస్వామి పై అజమాయిషి చేయడం ప్రారంభిస్తారు. ప్రేమ ముసుగులో వారు తన భాగస్వామిని నియంత్రించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అసూయ లేదా చికాకు దీనికి ప్రధాన సంకేతాలు. పదే పదే ప్రేమను వ్యక్తపరచడం, భాగస్వామిని ఎప్పటికప్పుడు నియంత్రించడం వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

పరిష్కార మార్గాలు..

ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వారు వెంటనే నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలంటున్నారు. నిపుణుల నుండి కౌన్సెలింగ్ ఆధిపత్య భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా బాధిత వ్యక్తి తన భావాలను లేదా తన మనస్సులో పాతిపెట్టిన విషయాలను పంచుకోగలుగుతారు. దీని కారణంగా ప్రతికూలత తొలగిపోతుంది. ప్రభావిత వ్యక్తి సానుకూలంగా భావిస్తారు.

ఒకరితో ఒకరు సమయం గడపడం..

బిజీ లైఫ్ లేదా ఇతర కారణాల వల్ల దంపతులు ఒకరితో ఒకరు సమయం గడపడం లేదు. ఇలా క్రమం తప్పకుండా జరిగితే సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఎవరైనా సారే తన భాగస్వామికి సమయం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా మానసిక అనారోగ్యం నుండి ఉపశమనం కలుగుతుందంటున్నారు నిపుణులు.

మీ భాగస్వామి అబ్సెసివ్ లవ్ డిజార్డర్‌కు గురైనట్లయితే వారి పై అస్సలు కోపం తెచ్చుకోకూడదంటున్నారు నిపుణులు. కొన్ని విషయాలలో సాధారణంగా లేదా ప్రేమగా వ్యవహరించడం ప్రారంభించాలంటున్నారు. సమస్యాత్మక వాతావరణంలో కోపంతో ప్రవర్తిస్తే కొత్త సమస్యలు పుట్టుకురావచ్చంటున్నారు నిపుణులు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed