లీప్ ఇయర్ అంటే ఏమిటి? ఇది ఫిబ్రవరిలోనే ఎందుకు వస్తుందో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-02-01 02:31:38.0  )
లీప్ ఇయర్ అంటే ఏమిటి? ఇది ఫిబ్రవరిలోనే ఎందుకు వస్తుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. దీన్ని లీప్ సంవత్సరం అంటారు. ఇక ఈ లీప్ సంవత్సరం 2020లో రాగా, మళ్లీ ఈ ఇయర్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే ? సాధారణంగా సంవత్సరంలో 365 రోజుంటాయి. కానీ ఈ లీప్ సంవత్సరంలో మాత్రం సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి. ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి, ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి.

అసలు లీప్ సంవత్సరం ఎందుకు వచ్చిందంటే? మన క్యాలెండర్‌లో సీజన్స్ మారుతుంటాయి. వాటన్నింటి మధ్య సమతుల్యత ఉండటానికి లీప్ ఇయర్స్, లీప్ డేలు అవసరం. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి సుమారుగా 365.2422 రోజులు పడుతుంది. అంటే 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ.అయితే ఆ ఎక్కువ కాలమే లీప్ సంవత్సరం.

ఇక లీప్ డే‌ను ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే దీని వెనుక ఒక రీజన్ ఉన్నదంట. అది ఏమిటంటే? పురాతన రోమ్‌లోని జూలియస్ సీజర్ క్యాలెండర్ సంస్కరణల సమయంలో క్యాలెండర్ లో మార్పులను ఫిబ్రవరి నెలలోనే చేశారంట. అప్పటినుంచి ఇది అలాగే కొనసాగుతుందంట. ఈజిప్షియన్ సౌర క్యాలెండర్ నుండి ప్రేరణ పొందిన సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు.ఇందులో క్యాలెండర్ సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమలేఖనం చేయడానికి లీప్ ఇయర్ కూడా ఉంది. 1582లో జూలియన్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్‌గా పరిణామం చెందిన తర్వాత కూడా, ఫిబ్రవరికి లీప్ డేని జోడించే సంప్రదాయం కొనసాగింది. అలా ఫిబ్రవరిలో లీప్ డేను పెట్టాల్సి వచ్చిందంట.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed