- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనం చదివేటప్పుడు ఏం జరుగుతుంది?... ఇంట్రెస్టింగ్‌గా పనిచేస్తున్న బ్రెయిన్ నెట్‌వర్క్స్..
దిశ, ఫీచర్స్: చదవడం అనేది ఒక నైపుణ్యం. ఎంత ఎక్కువ చదువుతామో.. మన న్యూరల్ కనెక్షన్స్ అంత స్ట్రాంగ్‌గా మారుతాయి. అయితే చదివినప్పుడు బ్రెయిన్‌లో ఏం జరుగుతుందనే విషయంపై సమాధానమిచ్చేందుకు శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తుండగా.. తాజా అధ్యయనం దీనిపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. హ్యూస్టన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ నిర్వహించిన సంచలనాత్మక అధ్యయనం.. మెదడు భాషను ఎలా ప్రాసెస్ చేస్తుందనే దానిపై ఆసక్తికర విషయాలను తెలిపింది.
మూర్ఛ చికిత్సలో భాగంగా అమర్చిన ఇంట్రాక్రానియల్ ఎలక్ట్రోడ్‌లతో 36 మంది మెదడు కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి పరిశోధకులు వినూత్న విధానాన్ని ఉపయోగించారు. చదివేటప్పుడు వారి నాడీ కార్యకలాపాలను రికార్డ్ చేయడం ద్వారా.. పదాలను అర్థం చేసుకోవడానికి మెదడులోని వివిధ భాగాలు ఎలా కలిసి పనిచేస్తాయని గమనించారు. రీడింగ్ టైమ్‌లో రెండు డిఫరెంట్ బ్రెయిన్ నెట్‌వర్క్స్ యాక్టివేట్ అవుతాయని తెలిపారు. మెదడు ఫ్రంటల్ లోబ్.. టెంపోరల్ లోబ్‌కు సంకేతాలను పంపడం మొదటి నెట్ వర్క్ పని కాగా.. వ్యక్తి తను చదివిన వాక్యంలోని అర్థాన్ని తెలుసుకోవడాన్ని ప్రారంభించినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రక్రియ భాషాపరమైన పజిల్‌ను పోలి ఉంటుంది. ఇక రెండో నెట్‌వర్క్ టెంపోరల్ లోబ్ మరో విభాగాన్ని వినియోగిస్తుంది. ఫ్రంటల్ లోబ్‌కు తిరిగి సిగ్నల్స్ సెండ్ చేస్తుంది. ఆసక్తికరంగా ఈ నెట్‌వర్క్ వాక్యాల ద్వారా కాకుండా పదాల ద్వారా పనిచేస్తుంది. ప్రతీ పదంపై అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.