ప్రతిరోజూ కరివేపాకు తీసుకుంటే శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా!

by Harish |   ( Updated:2023-12-05 03:05:22.0  )
ప్రతిరోజూ కరివేపాకు తీసుకుంటే శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా!
X

దిశ, ఫీచర్స్: కరివేపాకు.. భారతీయ వంటకాలలో భాగమైపోయింది. ఇది లేకుండా ఎలాంటి వంటకాలు అయిన అసంపూర్ణమే కాగా ప్రధానంగా కూరలకు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. కానీ కరివేపాకు వాసన, రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక ప్రతిరోజూ ఈ కరివేపాకుని మితంగా తినగలిగితే, మీకు అవసరమైన విటమిన్లు లభిస్తాయి. కరివేపాకు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ మూలం. కాగా అనేక వ్యాధులను నిరోధిస్తుంది. కొవ్వు కరిగించడానికి కూడా సహాయపడుతుంది.

* ప్రస్తుతం జంక్ ఫుడ్ తినడం కారణంగా కొంత మంది చాలా ఈజీగా బరువు పెరుగుతున్నారు. తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా వెయిట్ తగ్గడం లేదు. అటువంటి పరిస్థితిలో కొన్నిసార్లు సహజ పద్ధతులు పని చేస్తాయి. వీటిలో కరివేపాకు కూడా ఒకటి. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అందుకని క్రమం తప్పకుండా కరివేపాకు తింటే మొండి పొట్ట కొవ్వును తగ్గించడంతోపాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, స్లిమ్‌ అండ్ ఫిట్‌గా అవుతారు.

* కరివేపాకు చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా, కంటి చూపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. వికారం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఎలా తీసుకోవాలి?

* కరివేపాకులో ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీని కారణంగా జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది. కనుక రోజు వండుకునే ప్రతి వంటలో కరివేపాకుని చేర్చుకోండి.

* అంతేకాదు కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే కూడా బరువు తగ్గుతారు. కనుక దీంతో కషాయం చేసి తాగవచ్చు. దీని కోసం ఒక గ్లాసు నీటిని మరిగించి అందులో 10-15 కరివేపాకు ఆకులు జోడించండి. కొద్దిసేపు సన్నటి సెగ మీద మరిగించండి. తర్వాత నీళ్లు కాస్త చల్లారిన తర్వాత వడగట్టి తాగాలి. కావాలంటే కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని కూడా తాగవచ్చు. ఇలా చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు.

* సువాసనతో కూడిన కరివేపాకు టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా 1 కప్పు నీటిని మరిగించండి. అందులో 1 స్పూన్ జీలకర్ర అలాగే 10-12 కరివేపాకు రెబ్బలు జోడించండి. 3-4 నిమిషాలు ఉడకబెట్టండి. తర్వత ½ tsp పసుపు వేసి కలపండి. అంతే కరివేపాకు టీ తయారు.

ఈ టీలోని జీలకర్ర, పసుపు, కరివేపాకు.. మూడింటిలో కొవ్వును కరిగించడానికి బాగా పని చేస్తాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కొవ్వు కణజాలాల పెరుగుదలను అణిచివేస్తుంది. అందుకని వీటిని కలిపి తీసుకోవడం మూలంగా తొందరగా బరువు తగ్గవచ్చు.

Advertisement

Next Story

Most Viewed