- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైట్ షిఫ్ట్ చేసే వారికి బరువు తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!!
దిశ, ఫీచర్స్: ఐటీ, మీడియా, ఫార్మా వంటి కంపెనీల్లో ఉద్యోగులకు నైట్ షిఫ్ట్స్ తప్పనిసరిగా ఉంటాయి. కొంతమంది రోజుల తరబడి నైట్ షిఫ్టులు చేస్తుంటారు. తప్పక చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనీ సంపాదించే ఆలోచనలో పడి.. ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోరు. దీంతో చిన్నవయసులోనే అధిక బరువు, డయాబెటిస్, జీర్ణకోశ సమస్యలు, స్ట్రెస్, స్థూలకాయం, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ సమస్యలు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే వీటి నుంచి బయటపడేందుకు అలాగే ముఖ్యంగా బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* వాటర్ అధికంగా తీసుకోవాలి. 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లు తాగినట్లైతే వెయిట్ లాస్ అయ్యే చాన్స్ ఉంటుంది. అలసటగా అనిపించినప్పుడల్లా వాటర్ తాగండి.
* వర్క్ చేస్తూ మధ్య మధ్యలో నడవండి. నడవడం వల్ల శరీరంలోని జీవక్రియ మెరుగుపడుతుంది.
* నైట్ అంత వర్క్ చేసి మార్నింగ్ ఎక్కువగా ఆకలిగా అనిపిస్తే.. బయట ఇష్టమొచ్చిన ఫుడ్ తినకుండా ఇంట్లో ఉండే పండ్లు, రసాలు, సలాడ్లు తీసుకోండి. మార్నింగ్ పూట వీటిని తీసుకుంటే స్థూలకాయాన్ని నివారించవచ్చు.
* ఒకవేళ తెల్లవారుజామున 3 గంటలకు షిఫ్ట్ అయిపోతే చాలా మంది 3 నుంచి 9 గంటల వరకు ఎక్కువగా నిద్రపోతారు. అలా పడుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.
మీరు నైట్ షిఫ్ట్ వర్కర్ అయినప్పటికీ 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
* ఎప్పుడూ చీకటి గదిలో పడుకోండి. లైట్ వేసుకుని పడుకుంటే మంచి నిద్ర రాదు.
*చాలా మంది మూడు పూటల ఫుడ్ తీసుకోరు. వెయిట్ పెరగడానికి ఫస్ట్ రీజన్ ఇదే. నైట్ షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక, 6-8 గంటలు పడుకుని లేవండి. తర్వాత తిని కావాలంటే మళ్లీ పడుకోండి. నిద్రపోతున్నారని ఆహారాన్ని తినడం మానేస్తే శరీరంలో మార్పులు జరిగి బరువు పెరుగుతారు.
* నైట్ షిఫ్ట్ లో చాలా మంది కాఫీ తాగుతారు. కాఫీ అతిగా తాగితే నిద్ర రాకుండా ఉంటుంది. కానీ ఎక్కువగా తాగినట్లైతే జీవక్రియ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది.
* ప్రతి రోజూ 20 నిమిషాలు జాగింగ్ చేయండి. దీంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
* ఏసీ రూమ్ లో ఉండి బరువులు ఎత్తడం కన్నా సూర్యకాంతిలో 15 నుంచి 20 నిమిషాలు గడపండి.
* అలాగే ఆహారంలో ఎక్కువగా గుడ్లు, పాలు, పప్పులను చేర్చుకోండి.
* వేడి నీటితో స్నానం చేయండి. హాట్ వాటర్ తో స్నానం చేస్తే ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చు.
* నైట్ షిఫ్ట్ చేసి వచ్చాక ఓట్స్, రెడ్ రైస్, గోధుమలు వంటి ఆహారాలు తింటే మీ బరువు కచ్చితంగా కంట్రోల్‌లో ఉంటుంది.