Mood : ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. మానసిక స్థితిని సానుకూలంగా మార్చగలిగే మార్గాలివే..

by Javid Pasha |
Mood : ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. మానసిక స్థితిని సానుకూలంగా మార్చగలిగే మార్గాలివే..
X

దిశ, ఫీచర్స్: ఆ క్షణంలో మీరేం ఆలోచిస్తున్నారు?.. చేస్తున్న వర్క్‌పై ఎలా ఫోకస్ చేస్తున్నారు? ఉత్సాహంగా ఉన్నారా?.. నిరాశలో కూరుకుపోయారా? ఇలాంటి అంశాలన్నీ మీ మూడ్‌ను బట్టి కూడా ప్రభావితం అవుతుంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. రోజువారీ జీవితంలో వ్యాయామాలు చేయడం, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం మూడ్‌ను ఉత్సాహపరిచే విషయాలే కావచ్చు. కానీ కేవలం అవి మాత్రమే సరిపోవు. మానసిక స్థితిని మెరుగు పర్చగలిగే మెథడ్స్ ఇంకా అనేకం ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

ఆలోచనలను కాగితంపై రాయండి

అవును.. మీ మనసులో భావాలను, ఆలోచనలను కాగితంపై రాయడం లేదా డెస్క్‌టాప్‌పై టైప్ చేయడంవల్ల మానసిక స్థితిలో మార్పు వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇబ్బందిగా ఫీలవుతున్నప్పుడో, స్ట్రెస్ అధికమైనప్పుడో ఆ పరిస్థిని డైవర్ట్ చేయడానికి మంచి ఆలోచనలకు వెల్కం చెప్పండి. మీ కోసం ఓ 15 నిమిషాలు సమయం కేటాయించండి. మీ థాట్స్ అన్నీ ఓ కాగితంపై రాసి ఎనలైజ్ చేసుకోండి. దీంతో మానసిక స్థితి మెరుగు పడుతుందని, నిద్ర బాగా పడుతుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఆ సమయంలో ఫోన్ పక్కన పెట్టండి

ఈ రోజుల్లో పరిమితికి మించి సెల్ ఫోన్లు లేదా అదర్ గాడ్జెట్స్ అధికంగా యూజ్ చేయడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఈ పరిమితికి మించిన అలవాట్లు నిద్రను, ప్రొడక్టివిటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగని ఫోన్ వాడకం పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు. కాకపోతే రాత్రింబవళ్లు అందులో నిమగ్నం కాకుండా, అవసరాన్ని బట్టి మారండి. దీంతోపాటు ఫ్రెండ్స్‌తో, కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడటం, ఆరుబయట వాకింగ్ చేయడం, ఇంట్లో ఉంటే ఫోన్ దూరంగా పెట్టి పడుకోవడం వంటివి మీ మూడ్‌ను సానుకూలంగా మార్చేస్తాయి.

మొక్కలను పెంచండి

ఇంటి ఆవరణలో మొక్కలు నాటడం, పెంచడం, వాటిని సంరక్షించడం వంటి అలవాట్లు మానసిక స్థితిలో సానుకూల మార్పులకు కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. ఎయిర్ క్వాలిటీని పెంచడం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వడం ద్వారా మొక్కలు ఆనందాన్ని, జ్ఞాపక శక్తిని, ప్రొడక్టివిటీని పెంచుతాయి. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వర్క్ ప్లేస్‌లలో ఉద్యోగులు తమ డెస్క్ నుంచి మొక్కలను చూస్తూ వర్క్ చేసినప్పుడు 19 శాతం క్వాలిటీ పెరిగినట్లు ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది.

పాడటం.. మ్యూజిక్ వినడం

మీరు ఇంటిలో ఒంటరిగా ఉండి ఒత్తిడిగా ఫీలవుతుంటే గనుక.. స్నానం చేస్తూ పాటలు పాడటం, సోఫాపై కూర్చొని మ్యూజిక్ వినడం వంటివి మీలో మానసిక స్థతిని మెరుగు పరుస్తాయి. ఎండార్ఫిన్లు, డోపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్ పాటు సంతోషకరమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మీలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంచుతాయి.

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి

ఒకే తరహా పని లేదా పద్ధతివల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే అది ప్రతికూల మానసిక స్థితికి దారితీయవచ్చు. కాబట్టి అలాంటప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెడితే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల మీలో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. వీటితోపాటు దయాగుణం, కృతజ్ఞతా భావం, హెల్పింగ్ నేచర్ వంటివి కూడా మెరుగైన మానసిక స్థితిని కలిగిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ మూడ్‌ను చేంజ్ చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed