అమెరికాలో వాటంతటవే పేలుతున్న పుచ్చకాయలు.. ఎందుకంటే..

by Shiva |
అమెరికాలో వాటంతటవే పేలుతున్న పుచ్చకాయలు.. ఎందుకంటే..
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ సంస్థ అధ్యయనం ప్రకారం, పుచ్చకాయ పంటలలో ఒక నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. ఆ బ్యాక్టీరియా సహజ చక్కెర, ఈస్ట్‌ అనే పదార్థాలు ఒకే చోట ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పుచ్చకాయ ఫార్మెంటేషన్ కు గురవుతోంది. అయితే, ఆ బ్యాక్టీరియా ఉన్న పుచ్చకాయలు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఉంచితే.. బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. చివరి ఆ పుచ్చకాయలు ఒక్కసారిగా పేలుతాయి. కానీ, పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని కార్నెల్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్‌లో హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రీనర్స్ తెలిపారు. పుచ్చకాయ పేలడానికి బ్యాక్టీరియా లేదా ఫంగల్ అచ్చు వ్యాధి కూడా కారణం కావచ్చన తెలిపారు.

Read More: ఎడతెరిపిలేని వానలతో జాగ్రత్త.. వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తవచ్చు

Advertisement

Next Story

Most Viewed