Sugar Levels: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా?.. అయితే నీళ్లు ఎక్కువగా తాగండి

by Prasanna |   ( Updated:2023-03-05 15:12:52.0  )
Sugar Levels: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా?.. అయితే నీళ్లు ఎక్కువగా తాగండి
X

ఫీచర్స్ : అసలే ఎండాకాలం డయాబెటిస్ పేషెంట్లు నీళ్లు ఎక్కువగా తాగకపోతే ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారంగానే ప్రతీ వ్యక్తి నీళ్లు అధికంగా తాగాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఈ వ్యాధివల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగి తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది. దీనిని అదుపులో ఉంచుకోవాలి. శరీరంలోని అదనపు గ్లూకోజ్ యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది కాబట్టి రోజూ తగిన విధంగా యూరిన్ బయటకు వెళ్లాలంటే నీరు ఎక్కువగా తాగాలి. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు ఇదొక చక్కటి మార్గం.

డీ హైడ్రేషన్ ప్రభావం

ప్రధానంగా డయాబెటిస్‌ ఉన్నవారు నీళ్లు తాగకపోతే వేసవిలో తొందరగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇటువంటి సమస్యలు తెలెత్తకూడదంటే సరిపడా నీటిని తాగాలి. చాలా మంది భోజనంతర్వాతే నీళ్లను తాగుతుంటారు. కానీ డయాబెటిస్ పేషెంట్లు భోజనం తర్వాతే కాదు, భోజనానికి ముందు కూడా నీళ్లు తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఫుడ్ ఎంచుకోవాలి. కొన్నిరకాల పండ్లలో కూడా నీటిశాతం అధిరంగా ఉంటుంది. కాకపోతే తీపి ఎక్కువగా ఉండే పండ్లను తినకూడదు. ఎందుకంటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటూ నీళ్లు అధికంగా తాగడంవల్ల బాధితులపై డయాబెటిస్ ప్రభావం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.

Also Read: మనకు అలసట ఎందుకు కలగుతుంది...? ఇంతకు అలసట అంటే ఏమిటి..?

Advertisement

Next Story