Water timings: రోజులో నీళ్లను ఏ సమయంలో తాగాలో తెలుసా.. అస్సలు ఊహించి ఉండరుగా

by Kavitha |   ( Updated:2025-03-01 07:21:55.0  )
Water timings: రోజులో నీళ్లను ఏ సమయంలో తాగాలో తెలుసా.. అస్సలు ఊహించి ఉండరుగా
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం నీళ్ల లేకుండా ఉండలేము. మన ఆరోగ్య జీవితానికి వాటర్ ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే నీళ్లను తాగడానికి కూడా ఓ ప్రత్యేక సమయం ఉంటుందంట. ఈ విషయం చాలా మందికి తెలీదు. మరి ఆ టైం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

* ఉదయం పరగడుపునే 1 లీటర్ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

* అయితే ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగినా కూడా మంచి రిజల్ట్ ఉంటుందట.

* గోరు వెచ్చని నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. దీని వల్ల పేగులు శుభ్రంగా మారతాయట.

* అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలట.

* అలా కాకుండా భోజనం వెంటనే తాగితే జీర్ణక్రియకు ఇబ్బంది కలిగి ఆహారం అరగక ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు.

* అయితే అరగంట ముందు, తర్వాత తాగడం వల్ల నీళ్లు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి.

* వ్యాయామానికి ముందు ఒక గ్లాస్ నీరు తాగాలట. అలా తాగడం వల్ల బాడీ డీ హైడ్రేట్‌గా ఉంటుంది.

* అలాగే నిద్ర పోయే ముందు కూడా ఓ గ్లాస్ వాటర్ తాగి నిద్రపోతే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Next Story

Most Viewed