Walking benefits: జస్ట్ 10 నిమిషాలు.. ప్రతిరోజూ ఆ పనిచేస్తే కలిగే ప్రయోజనాలివే..

by Javid Pasha |
Walking benefits: జస్ట్ 10 నిమిషాలు.. ప్రతిరోజూ ఆ పనిచేస్తే కలిగే ప్రయోజనాలివే..
X

దిశ, ఫీచర్స్ : మధ్యాహ్నం వేళ, రాత్రి పూట.. సమయం ఏదైనా తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. దీనివల్ల శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం మెరుగు పడతాయని పేర్కొంటారు. తీవ్రమైన రోగాల ముప్పు తగ్గుతుందని కూడా పరిశోధనల్లో తేలింది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

* తిన్న తర్వాత 10 లేదా 15 నిమిషాలపాటు నడిచే అలవాటు కారణంగా మీరు ఫిట్‌గా, హెల్తీగా ఉండగలుగుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో కండరాలు, ప్రేగులు చురుకుగా పనిచేస్తాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడంలో నడక కీలకపాత్ర పోషిస్తుంది.

* జస్ట్ పది నిమిషాలు కేటాయించడం వల్ల అజీర్తి, మలబద్ధకం, పైల్స్, ఫిస్టులా వంటి సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తిన్న వెంటనే వాకింగ్ చేయడంవల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

* భోజనం తర్వాత నడిచేవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగు పడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు అయితే డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడం తప్పక అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కేలరీలు బర్న్ అవుతాయి. అధిక బరువును, శరీరంలో కొవ్వును నియంత్రిస్తాయి. పొట్ట పెరగకుండా ఉంటుంది.

* మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గించడంలో తిన్న తర్వాత వాకింగ్ చేయడం కీలకపాత్ర పోషిస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. మెంటల్లీ రిలాక్సేషన్‌కు కారణం అవుతుంది. నడక సమయంలో హార్ట్ రేట్‌ మార్పులు గుండె కండరాలను బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే మెరుగైన నిద్రకు, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, ఇతర ఆరోగ్య సమస్యల నివారణకు తిన్న తర్వాత పది నిమిషాల నడక చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed