- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విటమిన్ డి లోపం...సమస్య ఎక్కువ స్త్రీలకే అంట!
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో ‘విటమిన్ డి’ లోపంతో బాధపడే వారు చాలా ఎక్కువైపోయారు. ప్రస్తుతం ఇది ఒక సమస్యగా మారింది. ఈ లోపంతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా స్త్రీలే ఉన్నారు. ఎందుకంటే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పని చేస్తూ ఉండడం, కనీసం కొంచెం కూడా ఎండ తగలకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఈ లోపం బారిన పడుతున్నారు. అసలు విటమిన్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో చూద్దామా..
విటమిన్ డి లోపం ఉన్నవారికి విపరీతంగా ఆవలింతలు వస్తూ ఉంటాయి.. కానీ సరిగా నిద్ర పోలేరు. అస్సలు నిద్ర పట్టదు. తరచూ ఆనారోగ్యంతోనే ఉంటారు. ఏ మాత్రం కొద్దిగా వాతావరణం మారినా తట్టుకోలేరు. ఎప్పుడు జలుబు, దగ్గు లాంటివి ఇబ్బందిపెడుతూ ఉంటాయి. ఈ లోపం ఉన్నవారిలో మజిల్స్ చాలా వీక్‌గా మారిపోతాయి. దీంతో ఎప్పుడు చూసినా బలహీనంగా కనిపిస్తారు. మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయంటే కూడా ఇది ఒక కారణమే.
నిత్యం అలసటతో బాధపడుతూ ఉండడం, పుష్టిగా ఆహారం తీసుకున్నా నీరసంగా అనిపించడం, శరీరం ఎప్పుడూ నిద్రను కోరుకోవడం బాగా ఆయాసం, శరీరంలో సత్తువ లేనివారిలా కనపడడం లాంటివి ఎదురవుతాయి. విటమిన్ డి లోపం ఉన్నవారిని ముఖం చూడగానే గుర్తుపట్టవచ్చట. వారి కళ్ల కింద బ్లాక్ సర్కిల్స్ క్లియర్‌గా కనిపిస్తాయి. ఉదయం సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ముఖంలో తేజస్సు తగ్గిపోయి, నిరూత్సాహంగా కనిపిస్తుంది.
ఈ లోపం వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోవడం జరుగుతుంది. ఎక్కువగా డిప్రెషన్‌కి గురవడం, మానసికంగా చాలా బలహీనంగా ఉండడం, ఎముకలు బలహీనంగా మారడం, శీరరంలో కాల్షియం తగ్గిపోయి.. కీళ్ల నొప్పులు ఎక్కువగా రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ’విటమిన్ డి’ లోపంలో బాధపడుతున్నవారు డాక్టర్ కలిసి సలహాలు తీసుకోండి.
ఇవి కూడా చదవండి: రాత్రిళ్లు త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!