- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video : ఏంది తల్లి అది.. కుక్కపిల్ల అనుకున్నావా! మొసలితోనే పెట్టుకున్నావ్!!
దిశ, ఫీచర్స్ : నీటిలో ఉన్న మొసలిని దూరం నుంచి చూడ్డానికి ఎవరైనా ఉత్సాహం చూపడం సహజమే. కానీ దాని దగ్గరకు వెళ్తారా?.. అస్సలు వెళ్లరు. పైగా కొందరు భయంతో దూరంగా పారిపోతారు కూడా. కానీ ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్య పర్చింది. కుక్కపిల్లతో ఆడుకున్నంత ఈజీగా వాటర్‌లోని మొసలి దగ్గరకు వెళ్లి ముచ్చటించింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. అది బెలోవింగ్ ఎకర్ ఎలిగేటర్ అభయారణ్యం. దట్టమైన పొదలతో, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. అడవి మధ్యలో ఓ జలాశయం ఉండగా.. అందులో ఓ మొసలి తిరగాడుతోంది. కాగా ఆ అడవిలో జంతు సంరక్షణ యజమాని పేరు గాబీ కాగా, మొసలి పేరు బెల్లా అని వీడియో క్యాప్షన్‌ను బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉండగా బెల్లా చాలా కోపంగా, ఆకలిగా ఉందని, దానికి తినిపించాలంటే కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలని చెప్తూ ఆ మొసలి ఉన్న జలాశయంలోకి దిగుతుంది. గాబీ.
ఈ క్రమంలో గాబీ అనే మహిళ బెల్లా అనే మొసలిని సమీపిస్తూ దానితో ముచ్చటిస్తూ.. ఓ కర్రతో దాని నోటిని తెరుస్తూ వెంట తీసుకొచ్చిన ఆహారాన్ని తినిపిస్తుంది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. సదరు మహిళ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మరి కొందరు ‘ఏంది తల్లి అది.. నువ్వు పెంచుకున్న కుక్క పిల్ల అనుకున్నావా?.. మొసలితోనే పెట్టుకున్నావ్.. దానికి కోపం వస్తే నిన్ను మింగేస్తుంది’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఇలాంటి చర్యలు ధైర్యానికి నిదర్శనం అనుకుంటాం కానీ.. ప్రోత్సహించ కూడదు. ఎందుకంటే ప్రాణాల మీదకు రావచ్చు అని హెచ్చరిస్తున్నారు.
Video Credits To gabbynikolle Insta Id