Viral Video: ఏ నిమిషానికి ఏమి జరుగునో..! ‘బతుకు బండి’మీదే ప్రాణం వదిలేసి..

by Javid Pasha |
Viral Video: ఏ నిమిషానికి ఏమి జరుగునో..! ‘బతుకు బండి’మీదే ప్రాణం వదిలేసి..
X

దిశ, ఫీచర్స్: ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..’ లవకుశ సినిమాలోని ఈ పాట మీరు వినే ఉంటారు. ప్రస్తుత ఉరుకులూ పరుగుల జీవితానికి సరిగ్గా వర్తిస్తుందని కూడా పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనుషులు ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటారు. అందులో కొన్ని ఆనందాన్ని కలిగించేవైతే.. మరికొన్ని విషాదాన్ని నింపేవి ఉండొచ్చు. ఇంకొన్ని సదరు వ్యక్తికో, కుటుంబానికో తీరని బాధను మిగిల్చేవి కావచ్చు. మూడవ కోవకు అద్దంపట్టే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం.. అంటూ చలించిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ వీడియో ప్రకారం.. అది ఒడిషా రాష్ట్రంలోని ఓ పట్టణం. అక్కడ ఓ దుకాణం ముందు టూ వీలర్ (టీవీఎస్) ఆగి ఉంది. పలు రకాల తినుబండారాలు కలిగిన బ్యాగులు దానికి ముందు, వెనుక భాగంలో బస్తాల్లో తగిలించి ఉన్నాయి. వెహికల్‌పై సుమారు సుమారు ఓ 40 ఏండ్ల వ్యక్తి దాని హ్యాండిపైల్ తలవాల్చి నిద్రపోతున్నట్లు పడుకొని ఉన్నాడు. పరిస్థితి చూస్తుంటే..అతనొక వీధి వ్యాపారి అని, తిను బండారాలు కిరాణా కొట్టులకు సప్లై చేసి జీవనం సాగించే వ్యక్తి అని చూసిన వారెవరికైనా అర్థం అవుతుంది. అందరూ అదే అనుకున్నారు. వీధిగుండా వచ్చీ పోయేవారు అటు వైపు చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎంతసేపటికీ ఆ వ్యక్తి అదే పొజిషన్‌లో ఉండటం, కదలిక లేకపోవడంతో అటునుంచి నడుచుకుంటూ వెళ్లే జనాలకు అనుమానం వచ్చింది.

సదరు వ్యక్తి దగ్గరకు వచ్చిన కొందరు అతన్ని పిలిచిచినా.. కదిలించి చూసినా ఉలుకూ పలుకూ లేదు. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి పరిశీలించగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. అంబులెన్స్‌ను పిలిచించి పరీక్షించగా అప్పటికే చనిపోయాడు. వాహనంపై కూర్చొని ఉండగానే గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇది తెలిసిన చుట్టు పక్కల వారు పాపం బతుకు బండిపైనే ప్రాణం వదిలాడంటూ బాధపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘ఏ నిమిషానికి ఏం జరుగుతుందో.. అనేందుకు ఈ సంఘటనే నిదర్శనం.. అతన్ని మృతి కంటతడి పెట్టిస్తోంది’ అంటూ కొందరు, జీవితం బుడగలాంటిదని మరికొందరు స్పందిస్తున్నారు. వెళ్తూ వెళ్తూ జీవితం గురించి చాలానే నేర్పి వెళ్లావంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Video Credits to ‘Do something for better socity’ on X

Next Story

Most Viewed