భ‌ర‌త‌నాట్యం, హిప్‌హాప్ క‌లిస్తే.. అమ్మాయిల‌ కిర్రాక్ డ్యాన్స్ వీడియో

by Sumithra |
భ‌ర‌త‌నాట్యం, హిప్‌హాప్ క‌లిస్తే.. అమ్మాయిల‌ కిర్రాక్ డ్యాన్స్ వీడియో
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఫ్యూజ‌న్ ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. అందులోనూ క్లాసిక్, మోడ్ర‌న్ క‌ల‌గ‌లిస్తే మ‌రింత ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. ఇండియాలో పాపుల‌ర్ క్లాసిక‌ల్ డ్యాన్స్‌ భరతనాట్యం రూపమంతా శిల్పకళా, మనోహరమైన భంగిమలకు సంబంధించినది. విదేశీ హిప్ హాప్ డ్యాన్స్‌.. లాకింగ్, బ్రేకింగ్, ఫ్రీస్టైల్ కదలికలకు ప్రసిద్ధి చెందిన ఒక మోడ్ర‌న్‌ నృత్య రూపం. ఇక‌, ఈ రెండు నృత్య రూపాలు ఖచ్చితంగా అద్భుతమైనవి, ప్రజాదరణ పొందినవి కూడా. ఇలాంటి అద్భుతమైన నృత్య రూపాలు రెండూ కలిసి ఫ్యూజ‌న్ డ్యాన్స్ అయితే ఎలా ఉంటుందో ఊహించండి..? సాధారణంగా ఇవి రెండూ క‌ల‌వ‌డం చాలా మందికి ఇష్టం లేక‌పోయినా, చూస్తుంటే మాత్రం క్రిర్రాక్‌కా ఉంటుంద‌న‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.

కొరియోగ్రాఫర్ ఉషా జే తన పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. "#HybridBharatham అనే పేరుతో హిప్-హాప్, భ‌రతనాట్యం మధ్య స‌రికొత్త‌ మార్గం ఇది. నేను ఇష్టపడే, నేర్చుకునే, గౌరవించే ఈ 2 నృత్యాలు.. ప్రతి డ్యాన్స్ సారాంశాన్ని స‌జీవంగా ఉంచడం, నేను వాటికి న్యాయం చేసేలా ఏదైనా ఫ్యూజ‌న్‌ సృష్టించడం నా లక్ష్యం" అని రాస్తూ ఆమె వీడియోను పోస్ట్ చేసింది. ఈ డ్యాన్స్ రొటీన్‌కు కొరియోగ్రఫీ చేసింది తానే అని కూడా తెలిపింది. దాదాపు 6.5 లక్షల వీక్షణలను దాటేస్తున్న ఈ పోస్ట్‌పై కెనడియన్ సంగీతకారుడు షాన్ విన్సెంట్ డి పాల్ స్పందిస్తూ, "ఓహ్ మై గుడ్!!!!!!! నువ్వే సర్వస్వం. మీరందరూ ఈ వావ్ అనిపించారు" అని కామెంట్ చేశారు.

Advertisement

Next Story