Viral Video: మ్యారేజ్ ట్రెండ్ మారింది బాసూ.. ఏకంగా రాకెట్‌పై ఊరేగుతున్న వధూ వరులు!

by Javid Pasha |
Viral Video: మ్యారేజ్ ట్రెండ్ మారింది బాసూ.. ఏకంగా రాకెట్‌పై ఊరేగుతున్న వధూ వరులు!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అంటేనే అదో సందడి వాతావరణం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సంతోషకరమైన సందర్భం. ఇక ఈ సమయంలో ఎంతో హ్యాపీగా కనిపించే వధూ వరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మ్యారేజ్ తర్వాత వధువుకు వీడ్కోలు చెప్పే సమయంలో కంటతడి పెట్టుకోవడం సహజంగానే జరిగిపోతుంటాయి. అమ్మాయి అప్పగింతల వేళ ఆమె పేరెంట్స్ అయితే చాలా బాధపడుతుంటారు. వధువు కూడా ఏడుస్తూ పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్తుంది. ఇలా పెళ్లి జరిగే ప్రతీ సందర్భం ఆనంద భరిత క్షణాలతోపాటు భావోద్వేగాలతో నిండి ఉంటుంది.

ఈ రోజుల్లో అయితే పెళ్లి వేడుక మొత్తాన్ని కెమెరాలో బంధించడం చాలా కామన్ అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లతో మొదలు కొని పెళ్లి ముగిసే వరకు ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కాగా ఇటీవల ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోయింది. పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు వీడియో షూట్‌లు, వధూ వరుల డ్యాన్సులు, వెరైటీ ప్రోగ్రాములు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వైరల్ సమాచారాన్ని బట్టి చూస్తే.. పెళ్లి తర్వాత వెరైటీకోసం ఈ వీడియో క్రియేట్ చేసినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. పెళ్లి కూతురుకు వీడ్కోలు ఇలా కూడా పలుకుతారా? అని కొందరు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వధువుకు వీడ్కోలు తర్వాత సహజంగా కారులోనో, మరో వాహనంలోనో అత్తారింటికి బయలు దేరుతుంటారు కానీ.. ఇక్కడ వధూ వరులు ఏకంగా రాకెట్‌లో వెళ్లారు. ఓ ఇంటి ముందు ఉన్న ఒక పెద్ద రాకెట్ బాంబు మీద వరుడు కూర్చొని ఉంటాడు. అంతలోనే ఏడుస్తున్న వధువును ఆమె పేరెంట్స్ వరుడి వద్దకు తీసుకొస్తారు. ఆమెకు వీడ్కోలు చెప్పగానే వరుడి వెనుక రాకెట్ మీద కూర్చుంటుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి రాకెట్‌ను నిప్పుతో వెలిగిస్తాడు. ఇంకేముంది చూస్తుండగానే.. వధూ వరులు రాకెట్‌పై ఆకాశంలోకి ఎగిరిపోతారు. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. అది చూసిన కొందరు నెటిజన్లు.. ఓర్నీ పెళ్లి తర్వాత వీడ్కోలు ఇలా కూడా చెప్తారని ఇప్పుడే తెలిసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.. మ్యారేజ్ ట్రెండ్ మారింది బాసూ.. ఇప్పుడు వెరైటీ కోసం ఎలాగైనా చేయవచ్చు, రాకెట్‌పై కూడా ఊరేగవచ్చు అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.

Video Credits To Proffessor Master ji - Upwale

Advertisement

Next Story

Most Viewed